దారుణం.. పుట్టింటి నుంచి రానన్న భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే..

ABN , First Publish Date - 2022-09-24T22:44:26+05:30 IST

మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని సెహోర్‌లో దారుణం చోటు చేసుకుంది.

దారుణం.. పుట్టింటి నుంచి రానన్న భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే..

మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని సెహోర్‌లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటి నుంచి రాను అన్నందుకు ఓ భార్యపై భర్త దారుణానికి ఒడిగట్టాడు.. పుట్టింటి దగ్గరే ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టేసి వెళ్లిపోయాడు.. మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేస్తున్న మహిళను స్థానికులు రక్షించి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Rajasthan: వివాహితపై అత్యాచారం.. భర్తను చంపేస్తానని బెదిరించి దారణం.. చివరకు..


సెహోర్‌లోని కస్బా చౌకీ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల దీక్ష 2016లో ఉజ్జయినికి చెందిన రాజేష్ మాల్వియాని వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. రాజేష్ తరచుగా భార్యతో గొడవ పడి ఆమెను కొట్టేవాడు. భర్త దురాగతాలను భరించలేకపోయిన దీక్ష ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది. తిరిగి తనతో రావాలని దీక్షపై రాజేష్ తరచుగా ఒత్తిడి తెచ్చేవాడు. అయితే అతడితో వెళ్లేందుకు దీక్ష ఇష్టపడలేదు. 


రాజేష్ 15 రోజుల క్రితం కూడా సెహోర్‌ వెళ్లి దీక్షను కొట్టాడు. దీంతో ఆమె తలకు గాయమైంది. గాయం నుంచి కోలుకున్న దీక్ష.. భర్తపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. రాజేష్ మళ్లీ శుక్రవారం భార్య పుట్టింటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తీసి దీక్షపై పోసి నిప్పంటించాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీక్ష కేకలు విని ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను భోపాల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read more