కళ్లల్లో కారం కొట్టి భర్తను చితకబాదిన భార్య.. పక్కా ప్లాన్‌తో పుట్టింటికి తీసుకెళ్లి మరీ దాడి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-25T19:59:54+05:30 IST

ఆ భార్యాభర్తలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవారు..

కళ్లల్లో కారం కొట్టి భర్తను చితకబాదిన భార్య.. పక్కా ప్లాన్‌తో పుట్టింటికి తీసుకెళ్లి మరీ దాడి.. అసలేం జరిగిందంటే..

ఆ భార్యాభర్తలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవారు.. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడడం ప్రారంభించారు.. సోమవారం సాయంత్రం భర్త బయటి నుంచి ఇంటికి వచ్చే సమయానికి భార్య వంట చేయలేదు.. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.. భార్యపై భర్త చేయి చేసుకున్నాడు.. తనను కొట్టిన భర్తపై పగ తీర్చుకోవాలని భార్య మెగా ప్లాన్ వేసింది.. భర్తతో ప్రేమగా మాట్లాడి పుట్టింటికి తీసుకెళ్లింది.. అక్కడకు వెళ్లాక భర్త కళ్లలో కారం కొట్టి చితక్కొట్టింది.. ఇటుకతో భర్త బుర్ర బద్దలుగొట్టింది.. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. 

ఇది కూడా చదవండి..

భర్తను రోజూ చితకబాదుతున్న భార్య.. పరువు పోతుందని 9 ఏళ్లుగా ఎవరికీ చెప్పని భర్త.. కానీ హింస మరీ ఎక్కువ అవడంతో..


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మొరెనాలో నివాసం ఉంటున్న సంజయ్ సింగ్‌కు పూజ అనే మహిళతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక కొద్దిరోజుల తర్వాత చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి సంజయ్ బయటి నుంచి వచ్చే సరికి భార్య వంట చేయలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన సంజయ్ భార్యను కొట్టాడు. భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసిన పూజ కొద్దిసేపటి తర్వాత అతనితో ప్రేమగా మాట్లాడటం ప్రారంభించింది. భర్తకు నచ్చచెప్పి మంగళవారం ఉదయం పుట్టింటికి తీసుకెళ్లింది. 


పుట్టింటికి చేరుకోగానే పూజ వైఖరి మారిపోయింది. ఇటుకతో భర్త తల పగలగొట్టింది. అనంతరం గదిలోకి తీసుకెళ్లి కళ్లలో కారం చల్లి నిర్దాక్షిణ్యంగా కొట్టింది. పూజతో పాటు ఆమె తండ్రి, సోదరుడు కూడా సంజయ్‌ను తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో సంజయ్ అక్కణ్నుంచి తప్పించుకుని నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాడు. వైద్యులు అతడి తలపై కుట్లు వేశారు. అక్కణ్నుంచి సంజయ్ నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు చేరుకున్నాడు. తన భార్య  కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. సంజయ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Updated Date - 2022-05-25T19:59:54+05:30 IST