నిద్రపోతున్న భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. 10 గంటల్లోనే షాకింగ్ విషయం బయటపెట్టిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-06-13T22:48:18+05:30 IST

ఇంట్లో నిద్రపోతున్న తన భర్తను ఎవరో చంపేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది..

నిద్రపోతున్న భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్య.. 10 గంటల్లోనే షాకింగ్ విషయం బయటపెట్టిన పోలీసులు..!

ఇంట్లో నిద్రపోతున్న తన భర్తను ఎవరో చంపేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.. హతుడి కుటుంబ సభ్యులను, బంధువులను విచారించారు.. చివరకు హత్య జరిగిన 10 గంటల్లోనే షాకింగ్ విషయం బయటపెట్టారు.. భార్య చేతిలోనే అతడు హత్యకు గురయ్యాడని తేల్చారు.. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని బయటపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

నేను గర్భవతిని అయ్యానంటూ ఫోన్ చేసి చెప్పిన ప్రేయసి.. అతడు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఆమె నిర్ణయమిదీ..!


షాపూర్‌కు చెందిన ఆదివాసి (35) అనే వ్యక్తి మరణించినట్టు జూన్ 12 ఉదయం స్థానిక పోలీసులకు సమాచారం అందింది. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను చంపేశారని ఆదివాసి భార్య పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. అనంతరం ఆదివాసి సోదరుడిని, ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. తన వదినకు గ్రామానికి చెందిన అమన్ సింగ్ అనే వ్యక్తితో ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం ఉందని, కొన్ని రోజులుగా ముంబైలో ఉంటున్న అతను ఇటీవలె గ్రామానికి తిరిగి వచ్చాడని ఆదివాసి సోదరుడు పోలీసులకు చెప్పాడు. 


పోలీసులు అమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను అసలు విషయం చెప్పేశాడు. హతుడి భార్యతో తనకు వివాహేతర సంబంధం ఉందని, తరచుగా ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని, కొన్నిరోజుల కిందట ఆదివాసికి అనుమానం వచ్చి భార్య నుంచి ఫోన్ తీసేసుకున్నాడని చెప్పాడు. ఈ నెల 1వ తేదీన తాను ముంబై నుంచి వచ్చానని, ఆ సమయంలోనే ఆదివాసిని చంపాలని నిర్ణయించుకున్నామని, శనివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆదివాసిని గొడ్డలితో నరికి చంపేశామని చెప్పాడు. దీంతో పోలీసులు ఆదివాసి భార్యను, అమన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.  


Updated Date - 2022-06-13T22:48:18+05:30 IST