ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి.. కలుద్దామని వెళ్తే దారుణం.. అసలేం జరిగిందంటే
ABN , First Publish Date - 2022-04-11T08:39:51+05:30 IST
ఫేస్‌బుక్‌లో ఒక యువతితో ముఖేష్ అనే వ్యక్తికి పరిచయం బాగా పెరిగింది. చాలా రోజుల పాటు మెసెంజర్‌లో మాట్లాడుకున్న తర్వాత.. ఇటీవలే ఆమెను కలుద్దామని వెళ్లిన ముఖేష్ అక్కడు వెళ్లి షాకయ్యాడు. ఎందుకంటే తనతో ఇంతకాలం అమ్మాయిలా మాట్లాడింది...

ఫేస్‌బుక్‌లో ఒక యువతితో ముఖేష్ అనే వ్యక్తికి పరిచయం బాగా పెరిగింది. చాలా రోజుల పాటు మెసెంజర్‌లో మాట్లాడుకున్న తర్వాత.. ఇటీవలే ఆమెను కలుద్దామని వెళ్లిన ముఖేష్ అక్కడు వెళ్లి షాకయ్యాడు. ఎందుకంటే తనతో ఇంతకాలం అమ్మాయిలా మాట్లాడింది తన షాప్‌లో పనిచేసే కుర్రాడే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అతను తేరుకునేలోపే ఆ కుర్రాడు తుపాకీతో కాల్చి ముఖేష్‌ను చంపేశాడు. ఈ దారుణమైన ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో వెలుగు చూసింది.
స్థానికంగా ఒక షాపు నడుపుతున్న ముఖేష్ అనే వ్యక్తి.. తన షాపులో ఉజ్వల్ శర్మ అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే యజమాని ఇంటికి వస్తూ, వెళ్తూ ఉన్న ఉజ్వల్‌కు.. ముఖేష్ భార్య నీలమ్ దేవితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ముఖేష్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తీసుకున్న ఉజ్వల్.. ముఖేష్‌ను ట్రాప్ చేశాడు.
కొంతకాలం మెసేజిలు పంపుకున్న తర్వాత దామోదర్‌పూర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు రావాలని మార్చి 25న చెప్పాడు. యువతి పిలవడంతో అక్కడకు వెళ్లిన ముఖేష్.. ఉజ్వల్‌ను చూసి షాకయ్యాడు. అప్పుడే తుపాకీతో కాల్పులు జరిపి ముఖేష్‌ను చంపేశాడు ఉజ్వల్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఈ దారుణమైన నిజం వెలుగు చూసింది. ప్రస్తుతం ఉజ్వల్, నీలిమను అదుపులోకి తీసుకున్నారు.