నా చావు వార్తను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పండంటూ లేఖలో రాసిన వ్యక్తి.. ఆ నెంబర్‌ ఎవరిదో, అతడి కథేంటో పోలీసులకు తెలిసి..

ABN , First Publish Date - 2022-06-02T18:23:50+05:30 IST

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన ఏడాది తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి..

నా చావు వార్తను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పండంటూ లేఖలో రాసిన వ్యక్తి.. ఆ నెంబర్‌ ఎవరిదో, అతడి కథేంటో పోలీసులకు తెలిసి..

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన ఏడాది తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త మీద గృహహింస కేసు పెట్టింది.. అనంతరం మరో వివాహం చేసుకుంది.. తీవ్ర మనోవేదనకు గురైన భర్త బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. తన చావు వార్తను భార్యకు చెప్పాలని పేర్కొంటూ ఆమె నెంబర్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

ఇద్దరు కూతుళ్లను కన్నావ్.. వారసుడిని ఇవ్వలేకపోయావ్.. అంటూ ఓ భర్త చేసిన నిర్వాకమిది.. 15 ఏళ్ల క్రితమే పెళ్లయినా..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని బద్‌నగర్‌కు చెందిన ఉమేష్‌కు 2018లో ఉజ్జయినికి చెందిన రేణుతో వివాహమైంది. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత రేణు తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులు రేణుకు వేరే పెళ్లి చేశారు. రెండో పెళ్లికి ముందు రేణు, ఉమేష్‌పై గృహహింస కేసు కూడా పెట్టింది. భార్య రేణు రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసిన తర్వాత ఉమేష్ మనోవేదనకు గురయ్యాడు. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు. తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. 


బుధవారం ఉదయం ఉమేష్ తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అతను తిరిగి వచ్చేసరికి గదిలో ఉమేష్ ఉరివేసుకుని కనిపించాడు. షాకైన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూసైడ్ నోట్‌లో ఉమేష్ రాశాడు. ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా రేణు మాట్లాడింది. 


Updated Date - 2022-06-02T18:23:50+05:30 IST