పెళ్లైన రెండు వారాలకు యువకుడిపై కేసు పెట్టిన వధువు మాజీ భర్త.. 3 నెలలు జైలు శిక్ష తరువాత అతనికి మరో షాక్.. ఈ సారి భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-03-16T05:39:28+05:30 IST

వారిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.. మూడేళ్ల ప్రేమాయణం తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు.. వివాహం జరిగిన రెండు వారాల తర్వాత వరుడికి షాక్ ఎదురైంది. యువతి మాజీ భర్త చీటింగ్ కేసు పెట్టడంతో...

పెళ్లైన రెండు వారాలకు యువకుడిపై కేసు పెట్టిన వధువు మాజీ భర్త.. 3 నెలలు జైలు శిక్ష తరువాత అతనికి మరో షాక్.. ఈ సారి భార్య ఏం చేసిందంటే..

వారిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.. మూడేళ్ల ప్రేమాయణం తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు.. వివాహం జరిగిన రెండు వారాల తర్వాత వరుడికి షాక్ ఎదురైంది. యువతి మాజీ భర్త చీటింగ్ కేసు పెట్టడంతో పోలీసులు వరుడిని అరెస్ట్ చేశారు. మూడు నెలల జైలు శిక్ష అనంతరం విడుదలైన అతనికి మరో షాక్ ఎదురైంది. రూ.10 లక్షలు ఇవ్వకపోతే హనీమూన్ వీడియో బయటపెడతానని ఆ యువతి బెదిరించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన నవీన్ అనే యువకుడు గతేడాది డిసెంబర్‌లో రాణి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దిరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వివాహం జరిగిన తర్వాత ఇద్దరూ హనీమూన్‌కు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాణి మాజీ భర్త చీటింగ్ కేసు పెట్టాడని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. రాణికి అప్పటికే పెళ్లి జరిగిందని, ఒక కూతురు కూడా ఉందని తెలిసి నవీన్ షాకయ్యాడు. 


మూడు నెలల జైలు శిక్ష అనంతరం నవీన్ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన నవీన్‌ను రాణి, మరికొందరు వ్యక్తులు బెదిరిండచం ప్రారంభించారు. తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకపోతే హనీమూన్ వీడియో బయటపెడతామని బెదిరించారు. అంతేకాదు నవీన్ పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, ఇతర ముఖ్య పత్రాలను రాణి అపహరించింది. దీంతో నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 


Read more