భర్త సమాధి దగ్గరే పెళ్లి రోజు వేడుక.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్

ABN , First Publish Date - 2022-03-05T22:50:49+05:30 IST

భర్త సమాధి దగ్గరే ఆమె పెళ్లి రోజు వేడుక జరుపుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లికి చెందిన..

భర్త సమాధి దగ్గరే పెళ్లి రోజు వేడుక.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్

జగిత్యాల: భర్త సమాధి దగ్గరే ఆమె పెళ్లి రోజు వేడుక జరుపుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లికి చెందిన సుదర్శన్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సుదర్శన్‌కు 2014 మార్చి 3న ప్రవలికతో వివాహం జరిగింది. ప్రతి సంవత్సరం ఇద్దరు ఘనంగా పెళ్లి రోజు వేడుక జరుపుకునే వారు. భర్త భౌతికంగా దూరమైనా అతని జ్ఞాపకాల్లోనే ప్రవలిక జీవనం సాగిస్తోంది. పెళ్లి రోజు రావడంతో భర్తతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ గురువారం సమాధి దగ్గర పెళ్లి రోజు వేడుక జరుపుకుంది. పూలతో సమాధిని అలంకరించి అక్కడే కేక్ కట్ చేసింది. ఈ ఘటన ప్రవలిక బంధుమిత్రుల హృదయాలను ద్రవింపజేసింది. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్ అయ్యాయి. 
Read more