రోడ్డు పక్కన ఉండే చెట్ల మొదళ్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-11-20T12:21:18+05:30 IST

మనం మన రోజువారీ జీవితంలో అనేక విషయాలను చూస్తుంటాం. అయితే వాటిలో కొన్నింటి వెనుకనున్న కారణాలు మనకు తెలియదు. అలాంటివాటి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది.

రోడ్డు పక్కన ఉండే చెట్ల మొదళ్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలిస్తే...

మనం మన రోజువారీ జీవితంలో అనేక విషయాలను చూస్తుంటాం. అయితే వాటిలో కొన్నింటి వెనుకనున్న కారణాలు మనకు తెలియదు. అలాంటివాటి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. అటువంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోడ్డు పక్కన కనిపించే చెట్లకు తెలుపురంగు వేసివుండటాన్ని చూసేవుంటాం. దీనిని చూసినప్పుడు ఈ పని ఎందుకు చేశారనే అనుమానం మనకు కలుగుతుంది. దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

రోడ్డు పక్కన కనిపించే చెట్లకు తెలుపు రంగు వేయడం వెనుక ఒక కారణముంది. ఈ విధంగా చేయడం కారణంగా చెట్ల జీవితకాలం పెరుగుతుంది. చెట్లకు వేసేరంగును నీరు సున్నం కలిపి తయారు చేస్తారు. దీని వలన చెట్టు మొదళ్లను చీడపీడలు ఆశ్రయించవు. ఇంతేకాకుండా చెట్లకు తెలుపు రంగు వేయడం వలన మరొక లాభం కూడా ఉంది. ఆ రోడ్డుపై వెళుతున్నవారికి ఈ చెట్లపైనున్న తెలుపు రంగు మార్గాన్ని చూపేందుకు ఉపయోగపడుతుంది.

Updated Date - 2022-11-20T12:21:18+05:30 IST

Read more