శరీరంపై టాటూ ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు... కారణమిదే!
ABN , First Publish Date - 2022-11-10T11:47:25+05:30 IST
నేటి రోజుల్లో యువత తమ శరీరంపై టాటూలు వేయించుకోవడమంటే తెగ ఇష్టపడుతోంది. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు.
నేటి రోజుల్లో యువత తమ శరీరంపై టాటూలు వేయించుకోవడమంటే తెగ ఇష్టపడుతోంది. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలుకంటున్నవారు, శరీరంపై పచ్చబొట్టు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగింపునకు గురవుతారు. మనదేశంలోని కొన్ని ఉద్యోగాల విషయంలో శరీరంపై పచ్చబొట్టు ఉంటే వారిపై అనర్హత వేటు పడుతుంది. ఆ ఉద్యోగాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటూలు ఉంటే ఈ ఉద్యోగాలకు అనర్హులు
ఐఎఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీస్)
ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్)
ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్)
భారత సైన్యం
ఇండియన్ నేవీ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ కోస్ట్ గార్డ్
పోలీసు
ఈ ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థుల శరీరంపై ఒక్క పచ్చబొట్టు కనిపించినా వారిపై వేటువేస్తారు. టాటూను భౌతిక పరీక్ష ద్వారా తనిఖీ చేస్తారు. శరీరంపై టాటూలు వేయించుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, పచ్చబొట్టు అనేక వ్యాధులకు కారణమవుతుంది. దీని వల్ల హెచ్‌ఐవీ, చర్మవ్యాధులు, హెపటైటిస్ ఏ అండ్ బి వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తి క్రమశిక్షణలో ఉండడనే అభిప్రాయాయం వ్యక్తమవుతుంది. టాటూ వేయించుకున్న వ్యక్తికి పని కంటే అభిరుచులే చాలా ముఖ్యమైనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక మూడవ కారణం కారణం విషయానికొస్తే టాటూ వేయించుకున్న వ్యక్తికి భద్రతా దళాలలో ఉద్యోగం ఇవ్వరు. ఇది భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అతను పట్టుబడితే పచ్చబొట్టు ద్వారా గుర్తించబడతాడు.