నగరాలు లేదా గ్రామాల పేర్ల చివర పురం అని ఎందుకు ఉంటుందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-24T14:14:11+05:30 IST

భారతదేశంలోని చాలా నగరాల పేరు చివర...

నగరాలు లేదా గ్రామాల పేర్ల చివర పురం అని ఎందుకు ఉంటుందో తెలిస్తే..

భారతదేశంలోని చాలా నగరాల పేరు చివర పురం (పూర్) అని ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. జైపూర్, జోధ్‌పూర్, రాంపూర్, కాన్పూర్, నాగ్‌పూర్, జబల్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఉదయపూర్, గోరఖ్‌పూర్, షోలాపూర్, ఫతేపూర్, జౌన్‌పూర్ ఇలా.. మీరు నివసించే ప్రదేశం పేరులో కూడా ఈ పదం ఉండవచ్చు. అయితే ఊరి పేర్లలో పూర్ ఎందుకు ఉపయోగిస్తారు.. పూర్ అంటే ఏమిటని అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?


దీని అర్థం తెలుసుకుంటే అలా ఎందుకు ఉందో మీకే అర్థమవుతుంది. ప్రతి నగరానికి దాని పేరు వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. ఊరు పేరుకు ఒక నిర్దిష్ట కారణం ఉంటూ దాని చివర పూర్ అని రాస్తారు. రాజా జైసింగ్ జైపూర్‌ని స్థాపించినందున, అతని పేరు జై తర్వాత పూర్ చేరి, అది జైపూర్‌గా మారింది. పూర్ అనే పదం చాలా కాలంగా వివిధ స్థలాల పేర్ల కోసం ఉపయోగిస్తున్నారు. మహాభారతంలో హస్తినాపురంలో కూడా ఇది కనిపిస్తుంది. పూర్ అనే పదం గురించి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం దాని అర్థం నగరం లేదా కోట. దీని ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. ఒక నిర్దిష్ట పేరు తర్వాత పూర్ చేరిస్తే ఆ నగరానికి పూర్తి పేరు ఏర్పడుతుంది. పలువురు నిపుణులు పూర్ అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చిందని చెబుతారు. ఈ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లోని అనేక నగరాలలో కూడా పూర్ అనే పదం ఉంటుందని అంటున్నారు. 




Updated Date - 2022-05-24T14:14:11+05:30 IST