కప్పల జనాభా తగ్గితే మానవులకు వచ్చే ముప్పు ఇదే... హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2022-09-25T17:13:09+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కప్పల సంఖ్య వేగంగా తగ్గుతోంది. ఇది...

కప్పల జనాభా తగ్గితే మానవులకు వచ్చే ముప్పు ఇదే... హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రపంచవ్యాప్తంగా కప్పల సంఖ్య వేగంగా తగ్గుతోంది. ఇది మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, వ్యాధులు రాకుండా ఉండాలన్నా కప్పల ఉనికి అవసరం. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఈ విషయాన్ని నిరూపించారు. ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం 80వ దశకంలో పనామా, కోస్టారికాలో నీటిలో, భూమిపై... ఈ రెండింటిపై నివసించే ఉభయచరాల సంఖ్య తగ్గింది. 


వీటిలో కప్పలు అధికంగా ఉన్నాయి. తొలిదశలో శాస్త్రవేత్తలు దీనిపై సరైన పరిశోధనలు చేయలేకపోయారు. దోమల బెడద పెరగకుండా కప్పలు సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి నీటిలో ఉండే దోమల లార్వాలను తింటాయి. ఇది వాటికి ఇష్టమైన ఆహారం. ఈ విధంగా అవి మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు కృషి చేస్తుంటాయి. ఇది పరిశోధనల్లో రుజువైంది. గత 50 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే మనుషుల్లో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు ఎక్కువయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం 7 లక్షల 25 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో ఒక్క మలేరియా కారణంగానే 6 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. 

Updated Date - 2022-09-25T17:13:09+05:30 IST