గాఢ నిద్ర నుంచి భయంతో ఒక్కసారిగా మేల్కొంటున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే...
ABN , First Publish Date - 2022-10-17T12:53:42+05:30 IST
కొంతమంది నిద్రనుంచి అకస్మాత్తుగా మేల్కొవడం...
కొంతమంది నిద్రనుంచి అకస్మాత్తుగా మేల్కొవడం, నడవడం లేదా బిగ్గరగా కేకలు వేయడం లాంటివి చేయడం మనం చూసుంటాం. ముఖ్యంగా పిల్లలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? దీని వెనుక చెడు కల కారణమై ఉంటుందా? ఇదేమైనా ఒక రోగమా? దీని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక ప్రధాన కారణం 'భయం' అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ భయం సాధారణ భయం కాదు. కలలో నుండి మేల్కోవడం కాదు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఆ సమయంలో భయం కారణంగా మెలకువ వచ్చేస్తుంది. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో గుర్తుకురాదు. కొందమంది నిద్రలో నడుస్తుంటారు.
ఇది భిన్నమైన రుగ్మత. కొన్నిసార్లు భయం కారణంగా నిద్రలో నడిచేవారున్నారు. దీనిని నైట్ టెర్రర్ లేదా పారాసోమ్నియా అంటారు. ఇది ఉద్రేకానికి సంబంధించిన రుగ్మత. దీనికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
మనిషి చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఎంతగానో అలసిపోయినప్పుడు ఇది జరగవచ్చు.
శరీరం, మనసుకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేనప్పడు కూడా ఇది జరుగుతుంది.
కొన్నిసార్లు గతకాలపు గాయం మనస్సుపై తీవ్ర ప్రభావం చూపినప్పుడు కూడా ఇలా జరగవచ్చు.
కొన్నిసార్లు ఒత్తిడికి లోనయినప్పుడు దాని గురించి బహిరంగంగా మాట్లాడరు. అలాంటప్పుడు మనసు ఈ విధంగా ప్రవర్తిస్తుంది.
గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఒత్తిడి చురుకైన దశలోకి వస్తుంది. అప్పుడు రాత్రివేళ భయానక అనుభూతి కలుగుతుంది.