అచ్చుగుద్దిన ఎలోన్ మస్క్ గురించి మీకు తెలుసా?
ABN , First Publish Date - 2022-05-23T14:24:06+05:30 IST
టెస్లా సీఈఓ, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు..

టెస్లా సీఈఓ, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ ను పోలిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలోన్ మస్క్ రూపురేఖలతో కనిపించే ఒక చైనీస్ యవకుడు వీడియోలో కనిపిస్తాడు. యిలాంగ్ మా చైనాకు చెందిన వ్యక్తి. ఇతని మొదటి వీడియో డిసెంబర్‌లో చైనా టిక్‌టాక్ డౌయిన్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో యిలాంగ్ ఒక కారు ముందు నిలబడి ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఒక వినియోగదారు సోషల్ మీడియా ఎలోన్ మస్క్‌ని ఇలా అడిగాడు.. మీ రూపాన్ని పోలిన వ్యక్తిని కలవాలనుకుంటున్నారా? దీనికి ఎలోన్ మస్క్ అవును అని బదులిచ్చారు.
మస్క్ సోషల్ మీడియాలో ఇలా రాశాడు.. ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉంటే నేను కలవాలనుకుంటున్నాను. ఈరోజుల్లో ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు తయారవుతున్నాయి. ఏది నిజమో, ఏది నకిలీదో కనుక్కోవడం కష్టం. కాగా టిక్‌టాక్ చైనీస్ వెర్షన్‌లో mayilong0 పేరుతో ఖాతా ఉంది. దీనికి 230,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తి ఈ ఖాతాలో పలు వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలలో ఆ వ్యక్తి తాను చైనాకు చెందిన ఎలోన్ మస్క్ అని అభివర్ణించుకున్నాడు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత, కొంతమంది వినియోగదారులు దీనికి Yelong Musk అని పేరు పెట్టారు. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, చైనీస్ టిక్‌టాక్ డౌయిన్, వైబో అనే చైనీస్ ట్విట్టర్.. యిలాంగ్ వీడియో వైరల్ అయిన తర్వాత తమ ప్లాట్‌ఫారమ్‌ల నుండి యిలాంగ్-సంబంధిత కంటెంట్ మొత్తాన్ని తొలగించాయి. యిలాంగ్‌లో తమ మార్గదర్శకాలు ఉల్లంఘించాడని చైనీస్ ప్లాట్‌ఫారమ్ చెబుతోంది. ఈ విషయంపై యిలాంగ్ మీడియాకు ఓ ప్రకటన చేశాడు. చైనా సోషల్ మీడియా తన ఖాతా నుండి మొత్తం కంటెంట్‌ను ఎందుకు తొలగించిందో, ఇప్పటివరకు తనకు కారణం తెలియలేదని చెప్పాడు.