సూర్యుడు ఒకే చోట ఉన్నప్పుడు... జపాన్‌లో తొలుత సూర్యోదయం అవుతుందని ఎందుకు అంటారంటే...
ABN , First Publish Date - 2022-12-01T10:27:57+05:30 IST
ఉదయిస్తున్న సూర్యుడిని చూడటం అందరికీ ఆనందం కలిగిస్తుంది. సూర్యోదయాన్ని చూస్తే ఆ రోజంతా శుభంగా గడుస్తుందని కూడా అంటారు.
ఉదయిస్తున్న సూర్యుడిని చూడటం అందరికీ ఆనందం కలిగిస్తుంది. సూర్యోదయాన్ని చూస్తే ఆ రోజంతా శుభంగా గడుస్తుందని కూడా అంటారు. అలాగే సూర్యోదయాన్ని ఆస్వాదించడం వలన ఆరోగ్యం సమకూరుతుందని కూడా చెబుతుంటారు. సూర్యోదయం కాగానే మొదలయ్యే ప్రజల దినచ్య సూర్యాస్తమయంతో ముగుస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే.
నిజానికి సూర్యుడు ఒక చోట స్థిరంగా ఉంటాడని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని శాస్త్రవేత్తలు ఏనాడో తెలిపారు. సూర్యుని చుట్టూ తిరిగే భూమి తనలో తాను తిరుగుతుందనే విషయం తెలిసిందే. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని మనమంతా తిలకించేవుంటాం. అయితే సూర్యుడు ముందుగా ఎక్కడ ఉదయిస్తాడో తెలుసా? దీనికి సైన్స్ అత్యంత ఆసక్తికర సమాధానాన్ని తెలిపింది. భూమిపై తొలి సూర్యోదయం జపాన్ లో జరుగుతుందని చెబుతారు.
ప్రపంచంలోని అన్నిదేశాలు జీఎంటీ(గ్రీన్‌విచ్ మీన్ టైమ్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. కాలాన్ని లెక్కలోనికి తీసుకోవడమనే ఘనత న్యూజిలాండ్‌కే దక్కుతుందని అంటారు. న్యూజిలాండ్‌లో సమయం జిఎంటీ+13. జపాన్ సమయం జీఎంటీ+9. న్యూజిలాండ్‌లో ఉదయం 6 గంటలయినప్పుడు జపాన్‌లో రాత్రి 2 గంటలవుతుంది. అదేవిధంగా ప్రపంచంలో తొలి న్యూఇయర్ వేడుకలు న్యూజిలాండ్‌లో జరుగుతాయి. ఈ నూతన టైమ్ జోన్‌ను అనుసరించి ప్రపంచంలో తొలి సూర్యోదయం న్యూజిలాండ్‌లో జరుగుతుంది.
దీని ప్రకారం జపాన్‌లో తొలి సూర్యోదయం జరగక పోయినప్పటికీ అక్కడే తొలి సూర్యోదయం అవుతుందని ఎందుకంటారనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఇటాలియన్ వ్యాపారి, అన్వేషకుడు మార్కోపోలో 13వ శతాబ్దంలో జపాన్‌ను పశ్చిమ దేశాలకు పరిచయం చేశారు. నిజానికి అతను ఎన్నడూ జపాన్ యాత్ర చేయలేదు. చైనాలోని దక్షిణ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి ప్రజలు అతనికి జపాన్ గురించి తెలిపారు. దక్షిణ చైనావాసుల అభిప్రాయం ప్రకారం జపాన్ అనేది మార్క్ పోలో యాత్ర చేసిన మార్గంలో ఉంది. అక్కడే సూర్యుడు ఉదయిస్తాడు. అందుకే జనం జీ-పంగ్, జూ-పంగ్ అని అంటారు. దీని అర్థం సూర్యుడు ఉదయించే ప్రాంతం.