అస్వస్థత కారణంగానే కొడుకు చనిపోయాడనుకున్నారు.. ఓ రోజు కోడలు ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానం రావడంతో..
ABN , First Publish Date - 2022-01-25T22:35:07+05:30 IST
ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే మృతి చెందాడని అంతా అనుకున్నారు. అయితే ఓ రోజు మృతుడి భార్య, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి..

అతడు అప్పటికే కామెర్లు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవాడు. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదు. ఓ రోజు సడన్గా మరింత అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు కంగారుపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే మృతి చెందాడని అంతా అనుకున్నారు. అయితే ఓ రోజు మృతుడి భార్య, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.
చెన్నై నాగై జిల్లా వేదారణ్యం సమీపంలోని కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47), సూర్య(26) దంపతులు. పెళ్లయిన కొన్నేళ్లకు దేవేంద్రన్కు కామెర్లు వచ్చాయి. ఆ వెంటనే కిడ్నీ సంబంధిత సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. అయినా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. ఈ క్రమంలో దేవేంద్రన్ భార్య సూర్యకు అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ (32) పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు సూర్య అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అప్పుడప్పుడూ అతడితో కలుస్తూ ఉండేది.
ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..
అయితే రోజూ ప్రియుడిని కలవాలంటే భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో.. ఎలాగైనా వదిలించుకోవాలని కుట్ర పన్నింది. జవవరి 4వ తేదీన సాంబారు అన్నంలో విషం కలిపి పెట్టింది. అది తిన్న దేవేంద్రన్.. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 6వ తేదీ మృతి చెందాడు. అప్పటికే అతడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత మృతుడి భార్య తరచూ ప్రియుడితో పోన్లలో మాట్లాడుతుండడంతో దేవేంద్రన్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళను, ఆమె ప్రియుడ్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.