గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2022-04-05T01:44:40+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. స్నేహానికి ఉన్న అర్థమే మారిపోయింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో ముక్కు, మొఖం తెలీని వారు కూడా స్నేహితులైపోతున్నారు. ఈ స్నేహాలు చివరికి...

గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. స్నేహానికి ఉన్న అర్థమే మారిపోయింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో ముక్కు, మొఖం తెలీని వారు కూడా స్నేహితులైపోతున్నారు. ఈ స్నేహాలు చివరికి ఎటు దారితీస్తాయో కూడా ఎవరికీ తెలీదు. కొన్ని స్నేహాల వల్ల మంచి జరిగినా, చాలా ఆన్‌లైన్ స్నేహాలు.. చివరకు కన్నీటిని, కష్టాలనే మిగుల్చుతుంటాయి. ఇక యువతీయువకుల మధ్య ఏర్పడే ఆన్‌లైన్ స్నేహాల్లో.. చాలా వరకు మోసాలతో కూడకున్నవే ఉంటాయి. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...


బీహార్ రాష్ట్రం భగల్‌పూర్ ఖగారియాలోని మార్దార్ గ్రామానికి చెందిన ఓ యువకుడు నిత్యం ఆన్‌లైన్‌లోనే గడిపేవాడు. ఈ క్రమంలో అతడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే యాక్సెప్ట్ చేశాడు. తర్వాత అతడికి హాయ్ అంటూ మెసేజ్ చేసింది. దీంతో మొదలైన వారి చాటింగ్.. చివరికి ఫోన్లు చేసుకునే వరకూ వెళ్లింది. ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో యువకుడు ఆమె చెప్పినట్లుగా వినేవాడు. ఈ క్రమంలో ఓ రోజు దుస్తులు లేకుండా వీడియో కాల్ చేసింది. దీంతో యువకుడు కూడా దుస్తులు లేకుండా ఆమెతో మాట్లాడాడు. తర్వాత కొన్నాళ్లకు ఒక రోజు అతడికి ఓ మెసేజ్ వచ్చింది.

రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..


‘‘అర్జంట్‌గా నాకు రూ.50వేలు ఇవ్వకపోతే.. నీ న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తా’’.. అంటూ మెసేజ్ రావడంతో యువకుడు షాక్ అయ్యాడు. దీంతో భయపడి వెంటనే ఆమెకు ఫోన్‌పే ద్వారా రూ.7,100లు పంపించాడు. అయితే తర్వాత ఆమె మళ్లీ రూ.50,000లు కావాలని డిమాండ్ చేసింది. రూ.21,000 పంపుతానని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. అడిగినంతం డబ్బు వెంటనే పంపకపోతే వీడియోను అందరికీ షేర్ చేస్తానంటూ బెదిరించసాగింది. దీంతో యువకుడు భయపడి ఫేస్‌బుక్‌ ఖాతాను కూడా తొలగించుకున్నాడు. అయితే ఆమె ఫోన్ నంబర్‍‌కు మెసేజ్ పంపుతూ బెదిరించింది. దిక్కుతెలీని పరిస్థితుల్లో యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే..

Updated Date - 2022-04-05T01:44:40+05:30 IST