పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-19T23:09:06+05:30 IST

కేరళలోని కొల్లాం జిల్లా చవారా గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్, స్వాతి(22) దంపతులు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకోవడంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే స్వాతికి ఈ సంతోషం..

పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..

వివాహమైన కొత్తలో ఉన్న ప్రేమాభిమానాలను కొందరు దంపతులు జీవితాంతం కొనసాగిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకుని సరిదిద్దుకుంటారు. ఇంకొందరి వివాహ బంధాలు మధ్యలోనే ముగిసిపోతుంటాయి. చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చివరకు విడాకుల వరకు తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల్లో ఎవరోఒకరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకూ వస్తుంటుంది. కేరళలో పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకుండానే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరికి భార్యకు అసలు నిజం తెలిసి ఏం చేసిందంటే..


కేరళలోని కొల్లాం జిల్లా చవారా గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్, స్వాతి(22) దంపతులు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకోవడంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే స్వాతికి ఈ సంతోషం కొన్ని నెలలు కూడా ఉండలేదు. పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకముందే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ లాగా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తుండడంతో భార్యకు అనుమానం కలిగింది. వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..


ఈ విషయమై భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరిగేవి. కొన్నాళ్లు సక్రమంగా ఉన్న శ్యామ్‌లాల్.. తర్వాత యథావిధిగా అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో వారి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఓరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్యామ్‌లాల్.. చంపేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో స్వాతి రోజూ మరింతగా ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయింది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్యామ్‌లాల్‌ను అరెస్ట్ చేశారు.

నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

Updated Date - 2022-01-19T23:09:06+05:30 IST