-
-
Home » Prathyekam » what the husband told the doctors about the wife in their hospital spl-MRGS-Prathyekam
-
గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..
ABN , First Publish Date - 2022-01-21T03:27:32+05:30 IST
అతడికి అప్పటికే రెండు సార్లు వివాహమైంది. ఇద్దరు భార్యలతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో ...

భార్యపై ప్రేమ చూపించే భర్తలతో పాటూ చిత్రహింసలు పెట్టే భర్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భర్త.. వీరిందరికీ భిన్నంగా ఉన్నట్టున్నాడు. అతడికి అప్పటికే రెండు సార్లు వివాహమైంది. ఇద్దరు భార్యలతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తర్వాత డాక్టర్‌తో అతడు చెప్పిన మాట ఎంత వరకు వెళ్లిందంటే..
రాజస్థాన్ ఝలావర్‌కు చెందిన మంగళ్ సింగ్ లోహర్.. మూడో వివాహం చేసుకున్నాడు. గతంలో ఇద్దరు భార్యలతో విభేదాలు రావడంతో మూడేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. ఇటీవల మూడో భార్య గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గరపడుతుండడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. స్కానింగ్ చేసిన వైద్యులు, ఆమె కడుపులో కవలలు ఉన్నట్లు తెలిపారు. ఈ మాటకు సంతోషించాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా పిల్లలను చంపేయాలని వైద్యలుతో చెప్పాడు. అందుకుగాను వారికి రూ.2లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. ఈ మాటలకు షాకైన వైద్యులు.. విషయం మొత్తం పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఇలా ఎందుకు ప్రవర్తించాడనే విషయం ఇప్పటికీ తెలీదు. అయితే భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని మాత్రం పోలీసులకు తెలిసింది.