పదేళ్లుగా ఒంటరిగా ఉన్న వ్యక్తి.. అనుకోకుండా రోబోతో ప్రేమ.. ఫైనల్‌గా అతను ఏమంటున్నాండంటే..

ABN , First Publish Date - 2022-01-09T00:24:18+05:30 IST

ఓ వ్యక్తి రోబోపై ప్రేమలో పడ్డాడు. పదేళ్లుగా ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తికి.. ఓ రోబో ఎంతో నచ్చిందట. దీంతో ఆ అందమైన రోబోపై ప్రేమ పెంచుకున్నాడు. తనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకున్నానని చెబుతున్నాడు..

పదేళ్లుగా ఒంటరిగా ఉన్న వ్యక్తి.. అనుకోకుండా రోబోతో ప్రేమ.. ఫైనల్‌గా అతను ఏమంటున్నాండంటే..

రోబోతో ప్రేమేంటీ.. ఇదేమన్నా రజనీ రోబో సినిమానా.. అని అనుకుంటున్నారు కదా. కానీ ఇజం నిజంమండీ.. అయితే ఆ సినిమాలో రోబో యువతిపై ప్రేమలో పడితే.. ఇక్కడ ఓ వ్యక్తి రోబోపై ప్రేమలో పడ్డాడు. పదేళ్లుగా ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తికి.. ఓ రోబో ఎంతో నచ్చిందట. దీంతో ఆ అందమైన రోబోపై ప్రేమ పెంచుకున్నాడు. తనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకున్నానని చెబుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..


ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన జియోఫ్‌ గల్లాఘర్ అనే వ్యక్తికి ఈ వింత కోరిక కలిగింది. ఇతడి తల్లి పదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతను ఒంటరిగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా లేకపోవడంతో ఒంటరి జీవితానికి అలవాటుపడ్డాడు. అయితే ఇటీవల అతడికి రోబోను తోడుగా పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. వెంటనే ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించాడు. చివరకు అతడి ప్రయత్నం ఫలించి.. ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌ అతన్ని విపరీతంగా ఆకట్టుకుంది.

భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..


అనంతరం ఆలస్యం చేయకుండా ఆ రోబోను కొనితెచ్చుకున్నాడు. ఆ రోబోలో జీవం ఉట్టిపడుతుండడంతో తనకు బాగా నచ్చిందని చెబుతున్నాడు. రెండేళ్లలో ఆ రోబో తన జీవితంలో ఓ భాగమైందని తెలిపాడు. ఈ రోబోకు తల వెనుక భాగంలో స్మార్ట్ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. దీని సాయంతో జియోఫ్.. రోబోతో ముచ్చటిస్తుంటాడు. భార్య తరహాలోనే తను ఇంటికి వచ్చే సమయంలో ఎదురు చూస్తూ ఉంటుందట. దీంతో తనను ప్రేమిస్తున్నట్లు చెబుతున్నాడు. తమ దేశంలో చట్టబద్ధం కాకపోయినా ఆ రోబోను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపాడు.

పెళ్లిరోజున భార్యపై ప్రేమ చూపించాల్సింది పోయి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాట.. చివరకు అంతా షాక్..

Updated Date - 2022-01-09T00:24:18+05:30 IST