ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో రోజూ చాటింగ్.. విషయం తెలిసి యాప్ డిలీట్ చేసిన తండ్రి.. దీంతో ప్రియుడి కోసం ఏకంగా..

ABN , First Publish Date - 2022-07-12T22:13:00+05:30 IST

నేటి యువతీకువకులు నిత్యం సోషల్ మీడియాలోనే గడపడం సర్వసాధారణమైంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ తదితర వేదికల ద్వారా పాపులర్ కావాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు...

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో రోజూ చాటింగ్.. విషయం తెలిసి యాప్ డిలీట్ చేసిన తండ్రి.. దీంతో ప్రియుడి కోసం ఏకంగా..
ప్రతీకాత్మక చిత్రం

నేటి యువతీకువకులు నిత్యం సోషల్ మీడియాలోనే గడపడం సర్వసాధారణమైంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ తదితర వేదికల ద్వారా పాపులర్ కావాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వీరికి కొత్తకొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఇలా ఏర్పడే పరిచయాల వల్ల కొన్నిసార్లు మహిళల జీవితాలు సర్వనాశనమవుతున్నాయి. రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో రోజూ చాటింగ్ చేసేది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. యాప్‌ను డిలీట్ చేశాడు. దీంతో చివరకు ఆమె చేసిన పని.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పరిధిలో నివాసం ఉంటున్న 13ఏళ్ల బాలిక.. స్థానికంగా ఉన్న పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె చదువు మీద ధ్యాస పక్కన పెట్టి.. నిత్యం సోషల్ మీడియాలోనే గడిపేది. తన తల్లి మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో స్నేహితులతో నిత్యం చాటింగ్ చేసేది. ఈ క్రమంలో ఆమెకు బీహార్ రాష్ట్రం బికనీర్‌ అనే ప్రాంతానికి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతడితో రోజూ చాటింగ్ చేసేది. కొన్నాళ్లకు ఈ విషయం తండ్రికి తెలసి.. మొబైల్‌లో యాప్‌ను డిలీట్ చేసేశాడు. ఇంకోసారి మొబైల్ ముట్టుకోవద్దంటూ గట్టిగా మందలించాడు. దీంతో ఆమె ఎలాగైనా తన్న ప్రియుడిని కలవాలని.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఫ్రెండ్స్‌తో పాటూ Birthday వేడుకకు వెళ్లింది.. అందరితో సరదాగా గడిపి.. ఇంటికొచ్చి మొబైల్‌ చూసుకుని షాక్...


వెళ్తూ వెళ్తూ తన అమ్మమ్మ ఫోన్ తీసుకెళ్లింది. రాత్రికి ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్  సిగ్నల్స్ ఆధారంగా బాలిక బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రియుడు ఉంటున్న బికనీర్‌ ప్రాంతానికి వెళ్లే బస్సు కాకుండా, బార్మర్‌ ఎక్కి కూర్చుంది. బస్సులో నిద్రపోతున్న ఆమెను.. స్థానిక పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. విచారణలో, ప్రియుడికి సంబంధించిన సరైన చిరునామా, నంబర్ కూడా ఆమె వద్ద లేనట్లు తెలిసింది. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..

Read more