చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..

ABN , First Publish Date - 2022-01-07T01:04:08+05:30 IST

రాజస్థాన్‌లో 18 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి ప్రేమ పెంచుకున్నాడు. ఆమెకు ఇష్టం లేకున్నా ప్రేమించాలంటూ వెంటబడేవాడు. ఓ రోజు యువతి వెనుకే వెళ్లి అతను చేసిన పని.. అందరినీ దిగ్భాంతికి గురి చేసింది.. వివరాల్లోకి వెళితే..

చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ పేరుతో యువతులను వేధించడం తరచూ చూస్తూ ఉంటాం. ఇద్దరూ ఇష్టపడిన సందర్భంలో సమస్యలు లేకున్నా.. యువతులకు ఇష్టం లేకున్నా కొందరు మాత్రం ప్రేమించాలంటూ వేధిస్తుంటారు. ఎలాగైనా తమకే సొంత కావాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడుతుంటారు. రాజస్థాన్‌లో 18 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి ప్రేమ పెంచుకున్నాడు. ఆమెకు ఇష్టం లేకున్నా ప్రేమించాలంటూ వెంటబడేవాడు. ఓ రోజు యువతి వెనుకే వెళ్లి అతను చేసిన పని.. అందరినీ దిగ్భాంతికి గురి చేసింది.. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌ దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ముఖేష్ నానోమా అనే వ్యక్తి ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. కానీ ఆ యువతి మాత్రం ఇతడి ప్రేమను తిరస్కరించింది. అయినా తననే ప్రేమించాలంటూ వెంటబడేవాడు. ఈ క్రమంలో యువతికి ఇటీవల వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. అనంతరం కాబోయే భర్తతో ఆమె రోజూ ఫోన్లలో మాట్లాడేది. తన ప్రేమను కాదని.. వేరే వ్యక్తితో ఫోన్లలో మాట్లాడటాన్ని ముఖేష్ జీర్ణించుకోలేకపోయాడు.

రాత్రి వేళ గ్రామంలోకి చొరబడ్డ సింహం.. అంతా భయపడినా ఓ మహిళ మాత్రం.. చివరకు ఏం తెలిసిందంటే..


ఈ క్రమంలో ఆదివారం కూలి పనికి వెళ్లిన యువతి సాయంత్రం ఇంటికి వచ్చింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఇంట్లో లేరు. యువతి ఇంటి బయటికి వెళ్తుండగా.. యువకుడు ఆమె వెనుకే వెళ్లాడు. మధ్యలో అడ్డగించి తనను మాత్రమే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. యువతిపై అత్యాచారం చేసి, అనంతరం తలపై రాయితో బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఓ చెట్టుకు ఆమెను ఉరి వేశాడు. స్థానికుల సమాచారంతో సోమవారం రంగంలోకి దిగిన పోలీసులు.. 20గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..

Updated Date - 2022-01-07T01:04:08+05:30 IST