షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది? దానిని నివారించేందుకు ఏమి చేయాలంటే...

ABN , First Publish Date - 2022-12-01T12:02:04+05:30 IST

నేటి రోజుల్లో విద్యుత్ వినియోగం అనేది లేకుండా ఏ పనీ జరగడం లేదు. ఇంటిలోని గృహోపకరణాలు పనిచేయాలంటే విద్యుత్ తప్పనిసరి.

షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది? దానిని నివారించేందుకు ఏమి చేయాలంటే...

నేటి రోజుల్లో విద్యుత్ వినియోగం అనేది లేకుండా ఏ పనీ జరగడం లేదు. ఇంటిలోని గృహోపకరణాలు పనిచేయాలంటే విద్యుత్ తప్పనిసరి. అయితే అప్పుడప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరగుతుండటాన్ని మనం చూసి ఉంటాం. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతుంటారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెను ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. విద్యుత్ విషయంలో ఏ చిన్నపాటి పొరపాటు చేసినా అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఇంతకీ షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడిచే డివైజ్‌పై ఆపరేటింగ్ కరెంట్ అని ఉండటాన్ని గమనించే ఉంటారు. అది యాంపియర్లలో రాసి ఉంటుంది. యాంపియర్ అనేది విద్యుత్‌ను కొలిచే మాపకం. విద్యుత్ తీగలలోకి విద్యుత్ ప్రసారం అధికంగా వచ్చినప్పుడు అవి వేడెక్కిపోతాయి.

అటువంటి సమయంలో అవి కాలపోతుంటాయి. ఉదాహరణకు గీజర్ ఆపరేటింగ్ కరెంట్ 15 యాపియర్లు. దీనికి మించి ఒక యాంపియర్ కరెంట్ అధికంగా వచ్చినా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. మీరు ఒక ఎలక్ట్రిక్ సాకెట్‌లో మల్టీప్లగ్ పెట్టి దానిద్వారా పలు విద్యుత్ ఉపకరణాలు వినియోగిస్తే దానిపై విద్యుత్ లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇంటిలోని గృహోపకరణాలను వివిధ స్విచ్‌లకు అనుసంధానం చేసి వాటిని వినియోగించడం వలన షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Updated Date - 2022-12-01T12:02:08+05:30 IST