మానిటరే కదా ఏముందిలే అనుకోకండి... వీటిలోని రకాల గురించి తెలుసుకుంటే ఎప్పటికైనా ఉపయోగమే...
ABN , First Publish Date - 2022-10-26T12:01:25+05:30 IST
మానిటర్‌ని మనమంతా చూసేవుంటాం. అయితే మానిటర్లలోని రకాల గురించి మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి.
మానిటర్‌ని మనమంతా చూసేవుంటాం. అయితే మానిటర్లలోని రకాల గురించి మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మానిటర్ అంటే ‘మాస్ ఆన్ న్యూటన్ ఈజ్ ఆన్ ర్యాట్’. మానిటర్ అనేది సీపీయూలో నడిచే ప్రోగ్రామ్‌లను మనకు డిస్‌ప్లే చేస్తుంది. మానిటర్‌ను జ్వోరికిన్ 1929లో ఆవిష్కరించారు. ఈయన ఆవిష్కరించిన మానిటర్‌ను క్యాథోడ్- రే ట్యూబ్(సీఆర్టీ) మానిటర్ అంటారు. ఇది కాలానుగుణంగా ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఇప్పుడు మానిటర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈరోజు మనకు అనేక రకాలైన మానిటర్లు అందుబాటులోకి వచ్చాయి.
సీఆర్టీ మానిటర్: సీఆర్టీ మానిటర్ అతి పెద్దదిగా, భారీ సైజులో ఉంటుంది. సీఆర్టీ మానిటర్‌ను కేథోడ్ రెజ్ ట్యూబ్ అని అంటారు. 1970 దశకం చివరిలో సీఆర్టీ మానిటర్ వినియోగం ప్రారంభమయ్యింది. 1977లో యాపిల్ సీఆర్టీ కలర్ మానిటర్ ను ఆవిష్కరించింది.
ఎల్సీడీ మానిటర్: ఎల్సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే. దీనిని సీఆర్టీ మానిటర్‌తో పోల్చి చూస్తే బరువు తక్కువ. ఆక్రమించే స్థలం కూడా తక్కువే. ఎల్సీడీల వినియోగం 1990లో ప్రారంభమయ్యింది. దీనిని లాప్‌టాప్ మానిటర్‌గా అభివృద్ధి చేశారు.
టీఎఫ్టీ మానిటర్: టీఎప్టీ మానిటర్ ఎల్సీడీ మానిటర్ తరహాలోనే ఫ్లాట్‌గా ఉండటంతో పాటు పలుచగా ఉంటుంది. టీఎప్టీ అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. దీనిని ఎల్సీడీతో పోల్చిచూస్తే మరింత మెరుగ్గా పనిచేస్తుంది.
ప్లాజ్మా మానిటర్: ప్లాజ్మా మానిటర్ అద్దంతో తయాయినది. దీనిని ప్లాజ్మా డిస్‌ప్లే అని కూడా అంటారు. దీనిలో అద్దం లోపలి భాగంలో చిన్నపాటి సెల్ వినియోగిస్తారు. దీనిలో ఎలక్ట్రికల్లీ ఛార్జ్ అయోనైజ్డ్ గ్యాన్ నింపుతారు. దీనినే ప్లాజ్మా అని అంటారు. అందుకే దీనిని ప్లాజ్మా టీవీ అని అంటారు.
ఎల్ఈడీ మానిటర్: ఎల్ఈడీ మానిటర్ అత్యంత పలుచగా ఉంటుంది. ఇది మన కంటికి ఎటువంటి హాని చేయదు. ఎల్సీడీ మానిటర్‌తో పోలిస్తే ఇది సుదీర్ఘ కాలం పనిచేస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఎల్ఈడీ మానిటర్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇది తక్కువ ఎలక్ట్రిసిటీని వినియోగిస్తుంది.