-
-
Home » Prathyekam » What he did was call his girlfriend home on the occasion of her birthday in kerala spl-MRGS-Prathyekam
-
పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని ఇంటికి పిలిచాడు.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి..
ABN , First Publish Date - 2022-04-25T00:48:41+05:30 IST
తనను కాదన్నా ప్రియురాలి క్షేమం కోరే వారు.. నేటి సమాజంలో మచ్చుకైనా కానరావడం లేదు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ధోరణిలో చాలా మంది దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే...

తనను కాదన్నా ప్రియురాలి క్షేమం కోరే వారు.. నేటి సమాజంలో మచ్చుకైనా కానరావడం లేదు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ధోరణిలో చాలా మంది దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పుట్టిన రోజు ఉండడంతో ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది...
కేరళలోని తిరువనంతపురం పాలక్కడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం, స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారు మాత్రం వీరి పెళ్లికి నిరాకరించారు. అయినా బాలసుబ్రమణియం మాత్రం ఎలాగైనా ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం అతడి పుట్టిన రోజు కావడంతో వేడుకలు నిర్వహించి, తన ప్రియురాలిని కూడా ఆహ్వానించాడు.
ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..
యువతి రాగానే ప్రత్యేకంగా మాట్లాడాలంటూ ఆమెను వేరే గదికి తీసుకెళ్లాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నట్టుండి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటంబ సభ్యులు మంటలను ఆర్పేసి, ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. బాలసుబ్రమణియం తల్లి మాట్లాడుతూ.. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని, అయితే తన కొడుకు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.