‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అంటూ లైవ్‌లోనే యాంకర్‌ను అడిగేసిన వ్యక్తి.. అవాక్కయిన ఆమె చివరకు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-19T02:18:33+05:30 IST

ఓ యువతి ప్రముఖ ఛానెల్‌లో వార్తలు చదువుతోంది. మధ్యలో ఇద్దరు బాలికలు లోపలికి ఎంటర్ అవుతారు. యాంకర్ వద్దకు వెళ్లి గులాబీ పూలను అందిస్తారు. వాటిని సంతోషంగా తీసుకున్న ఆమెకు.. ఆ వెంటనే ఓ వ్యక్తి సడన్ షాక్ ఇస్తాడు..

‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అంటూ లైవ్‌లోనే యాంకర్‌ను అడిగేసిన వ్యక్తి.. అవాక్కయిన ఆమె చివరకు ఏం చేసిందంటే..

ప్రియురాలి ఎదుట తమ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలనే విషయంలో కొందరు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. కొందరు పాత పద్ధతిలో ప్రేమ లేఖలు రాసి తెలియజేస్తే.. మరికొందరు ఇంకొంచెం కొత్తగా ఆలోచిస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రపోజ్ చేశాక అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. ప్లాన్ బెడిసి కొట్టిందంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో తెలియజేసేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తన ప్రియురాలికి ఏకంగా టీవీ లైవ్ షోలోనే.. నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ అడిగేశాడు.


అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. ఓ యువతి ప్రముఖ ఛానెల్‌లో వార్తలు చదువుతోంది. మధ్యలో ఇద్దరు బాలికలు లోపలికి ఎంటర్ అవుతారు. యాంకర్ వద్దకు వెళ్లి గులాబీ పూలను అందిస్తారు. వాటిని సంతోషంగా తీసుకున్న ఆమెకు.. ఆ వెంటనే ఓ వ్యక్తి సడన్ షాక్ ఇస్తాడు. దగ్గరికి వెళ్లి యాంకర్‌ను కౌగిలించుకుని, తర్వాత ఖరీదైన గిఫ్ట్ చూపించి నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ అడిగేస్తాడు. ఊహించని పరిణామానికి ఆమె ఉక్కిరిబిక్కిరవుతుంది. తనకు కూడా ఇష్టమేనన్నట్లుగా సంకేతం ఇస్తుంది. అప్పటికే ప్రేమలో ఉన్న వారు.. దంపతులుగా మారేందుకు దీంతో మార్గం సుగమం అయింది. ఇదిలావుండగా.. వీడియోలో కనిపించే ఇద్దరు బాలికలు ఆ వ్యక్తి కూతుళ్లే. భార్య లేకపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకునేందుకు కూతుళ్లు కూడా సహకరించారని ఆ వ్యక్తి తెలిపాడు.

చిల్లర బస్తాతో బైకు షోరూంకు వెళ్లిన వ్యక్తి.. తలలు పట్టుకున్న సిబ్బంది..

Updated Date - 2022-02-19T02:18:33+05:30 IST

Read more