వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-03T02:06:53+05:30 IST

ప్రేమ (love) పేరుతో మోసం చేయడం ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. కొందరు సోషల్ మీడియాలో అందమైన యువతల (young women) ఫొటోలను పెట్టి.. తద్వారా..

వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ (love) పేరుతో మోసం చేయడం ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. కొందరు సోషల్ మీడియాలో అందమైన యువతల (young women) ఫొటోలను పెట్టి.. తద్వారా డబ్బున్న వారికి ఎర వేస్తుంటారు. మరికొందరు ప్రేమ, పెళ్లి పేరుతో చివరకు సర్వం దోచేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ముఠా బాగోతాలు కోకొళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ (Gujarat) లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వస్త్ర వ్యాపారిని ప్రేమించిన యువతి.. అతడికి ప్రేమగా స్నాక్స్ తినిపించింది. వెనువెంటనే చోటు చేసుకున్న ఘటనతో చివరకు వ్యాపారి షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


గుజరాత్ రాష్ట్రం శివపురి నార్వార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వస్త్ర వ్యాపారం (Textile business) చేస్తుంటాడు. ఆర్థికంగా స్థిరపడిపోయిన ఇతడి జీవితంలో ఇటీవల అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇటీవల అతడికి సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. అమ్మాయి తీయని మాటలకు ఆకర్షితుడైన వ్యాపారి.. తన పనులను పక్కన పెట్టి మరీ ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. రోజూ ఫోన్లలో మాత్రమే మాట్లాడే యువతి.. సోమవారం కలుద్దామని చెప్పింది. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వ్యాపారి.. ముందు, వెనుకా ఆలోచించకుండా గ్వాలియర్‌లో ఆమె చెప్పిన హోటల్ గదికి వెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వ్యాపారికి ఆమె ప్రేమగా స్నాక్స్ తినిపించడంతో పాటూ కూల్‌డ్రింక్స్ తాపింది.

Viral Video: ముద్దు పెట్టి మరీ చింపాంజీ చేసిన లవ్ ప్రపోజ్‌కు.. సిగ్గుపడిపోయిన యువతి.. అవాక్కవుతున్న నెటిజన్లు..


మరుక్షణమే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి తేరుకుని లేవగానే ఎదురుగా యువతితో పాటూ మరికొందరు యువకులు మొబైల్ పట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో నగ్నంగా ఉన్న తనను తాను చూసుకుని వ్యాపారి ఖంగుతిన్నాడు. వెంటనే రూ.25 లక్షలు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని వారంతా బెదిరించారు. దీంతో భయపడిపోయిన వ్యాపారి అప్పటికప్పుడే రూ.2లక్షలు సమర్పించుకున్నాడు. అయితే మిగతా డబ్బుల కోసం బెదిరిస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం, ముఠాను హోటల్‌కు పిలిపించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతితో పాటూ మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..Read more