స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..

ABN , First Publish Date - 2022-07-03T22:20:03+05:30 IST

హైదరాబాద్‌లో దిశ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇలాంటి తరహా ఘటనలు దేశంలో నలుమూలలా రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో దిశ..

స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో దిశ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇలాంటి తరహా ఘటనలు దేశంలో నలుమూలలా రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో దిశ తరహా ఘటనే జరిగింది. అయితే ఈ ఘటనలో బాలిక అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో ఇద్దరు బాలికలు కలిసి తోసుకుంటూ వెళ్తున్నారు. వారిని గమనించిన ఓ యువకుడు.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఓ బాలికను తన బైకుపై ఎక్కించున్నాడు. అయితే మధ్యలో పర్సు మర్చిపోయానంటూ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని లసుడియా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 15ఏళ్ల బాలిక, తన ఇంటి పొరుగున ఉండే స్నేహితురాలితో కలిసి స్కూటీపై బయటికి వెళ్తోంది. అయితే కొంచెం దూరం వెళ్లగానే స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. దీంతో ఇద్దరూ కలిసి బండిని తోసుకుంటూ వెళ్తున్నారు. కాసేపటికి అటుగా బైకుపై వెళ్తున్న భూపేంద్ర.. బాలికలను గమనించాడు. ‘‘పెట్రోల్ పంప్ దూరంలో ఉంది.. నా బైక్‌ ఎక్కండి.. బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని వద్దాం’’.. అని చెప్పి ఓ బాలికను ఎక్కించుకున్నాడు. ఇంకో బాలిక స్కూటీని అక్కడే ఆపుకొని వేచి చూస్తూ ఉంది.

ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..


బాలికను ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లాక.. ‘‘అయ్యో.. నా పర్సు మర్చిపోయాను.. దగ్గరలో మా స్నేహితుడి ఇల్లు ఉంది.. అక్కడికి వెళ్లి డబ్బులు కానీ.. పెట్రోల్ కానీ తీసుకొద్దాం’’.. అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక సరే అని బదులిచ్చింది. దీంతో బాలికను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అయితే బాలిక మాత్రం బయటే వేచి ఉంది. దీంతో ‘‘లోపలికి వచ్చి నీళ్లు తాగండి’’.. అని బాలికను పిలిచాడు. ఆమె లోపలికి వెళ్లగానే.. అప్పటికే గదిలో ఉన్న టిను అనే వ్యక్తి తలుపులు మూసేశాడు. తర్వాత భూపేంద్ర బాలికపై బలాత్కారం చేశాడు. ఆమె తిరస్కరించడంతో దాడి చేసి, అనంతరం నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..


తర్వాత టిను కూడా బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అంతలో ఏదో పనుండి వేరే గదిలోకి వెళ్లాడు. అదే సమయంలో భూపేంద్ర కూడా బాత్‌రూంలోకి వెళ్లడంతో.. బాలిక చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. బయటికి వెళ్లి స్నేహితురాలు, తల్లిదండ్రులకు పోన్ చేసి, విషయం తెలియజేసింది. తర్వాత అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..

Updated Date - 2022-07-03T22:20:03+05:30 IST