రెండేళ్లు ప్రేమించుకున్న అనంతరం.. పెళ్లికి నిరాకరించిన యువతి.. ఆమె చెప్పిన కారణం విని షాకైన యువకుడు..

ABN , First Publish Date - 2022-07-12T23:38:01+05:30 IST

ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా యువతులే మోసపోతుంటారు. మాయమాటలు చెప్పి ప్రేమించి, పెళ్లి వరకూ వచ్చేసరికి మాట మార్చుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో యువతులు తీవ్ర మానసికి క్షోభకు..

రెండేళ్లు ప్రేమించుకున్న అనంతరం.. పెళ్లికి నిరాకరించిన యువతి.. ఆమె చెప్పిన కారణం విని షాకైన యువకుడు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా యువతులే మోసపోతుంటారు. మాయమాటలు చెప్పి ప్రేమించి, పెళ్లి వరకూ వచ్చేసరికి మాట మార్చుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో యువతులు తీవ్ర మానసికి క్షోభకు గురై చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడడం రోజూ వింటూనే ఉన్నాం. బీహార్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి రెండేళ్లు ప్రేమించిన అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పింది. యువతి చెప్పిన కారణం విని ఆ యువకుడు షాక్ అయ్యాడు. చివరకు అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...


బీహార్ రాష్ట్రం భోజ్‌పూర్‌ పరిధి డియోరీ గ్రామానికి చెందిన అమృత్ సింగ్ అనే యువకుడు.. తల్లితో కలిసి చాంద్వా అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి స్థానికంగా ఉంటున్న ఓ యువతి పరిచయమైంది. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇటీవల యువకుడు తన ప్రియురాలి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే యువతి సడన్‌గా మాట మార్చింది. నేను వేరే యువకుడిని ప్రేమిస్తున్నాను.. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నన్ను మర్చిపో.. అని తెగేసి చెప్పింది. దీంతో అప్పటి నుంచి అమృత్ సింగ్.. తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో రోజూ చాటింగ్.. విషయం తెలిసి యాప్ డిలీట్ చేసిన తండ్రి.. దీంతో ప్రియుడి కోసం ఏకంగా..


ఎన్నిసార్లు ప్రియురాలితో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సోమవారం ప్రియురాలికి ఫోన్ చేసి, ఊరి బయటకు రమ్మని పిలిచాడు. అక్కడ పెళ్లి విషయమై మళ్లీ ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కోపంతో  ప్రియురాలి మీద చేయిచేసుకున్న అమృత్ సింగ్.. అప్పటికే జేబులో సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో తన చేతిని కట్ చేసుకున్నాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఫ్రెండ్స్‌తో పాటూ Birthday వేడుకకు వెళ్లింది.. అందరితో సరదాగా గడిపి.. ఇంటికొచ్చి మొబైల్‌ చూసుకుని షాక్...

Read more