మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-10T03:09:16+05:30 IST

మేము కార్పొరేషన్ ఉద్యోగులం.. మీ ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చాం.. అని ఎవరైనా అంటే, మీ ఇంట్లోకి స్వాగతించారా. అయితే మీ పని గోవిందా! మీ ఇల్లు గుళ్లవడంతో పాటూ మీ ప్రాణాలకు...

మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..

మేము కార్పొరేషన్ ఉద్యోగులం.. మీ ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చాం.. అని ఎవరైనా అంటే, మీ ఇంట్లోకి స్వాగతించారా. అయితే మీ పని గోవిందా! మీ ఇల్లు గుళ్లవడంతో పాటూ మీ ప్రాణాలకు కూడా ప్రమాదం రావొచ్చు. ఎందుకంటే గుజరాత్‌లో ఇలాగే జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగుల పేరుతో ఓ ఇంట్లోకి వెళ్లిన కొందరు దొంగలు.. చోరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే చివరకు ఏమైందంటే..


గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని అదాజన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. భూలాభాయ్ పార్క్ రోడ్‌లోని సీకే విల్లా సొసైటీకి చెందిన ఇంటి నంబర్ 13లో జిగ్యాసా తేజస్ పటేల్ అనే మహిళ నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, గురువారం ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. ‘‘మేము కార్పొరేషన్ ఉద్యోగులం.. మీ ఇంటి వాటర్ ట్యాంక్ తదితరాలను తనిఖీ చేయాలి’’... అని చెప్పారు. ముగ్గురూ యూనిఫాం ధరించడంతో పాటూ వారి వద్ద ఐడీ కార్డులు కూడా ఉండడంతో లోపలికి అనుమతించింది. ట్యాంక్, ఇంటి పరిసరాలను గమనించే క్రమంలో ఆమెను గట్టిగా నోరు మూశారు.

భవనంపైకి ఎక్కి కూర్చున్న వ్యక్తి.. రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. చివరకు..


అపస్మారక స్థితిలోకి వెళ్లేలా ముక్కు వద్ద రసాయనం పెట్టారు. అయితే ఆమె తెలివిగా వెంటనే మూర్చపోయినట్లు నటించింది. దీంతో దొంగలు ఆమెను అక్కడే వదిలేసి, ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లారు. వెంటనే  పైకి లేచిన మహిళ.. బయటికి పరుగెత్తుకెళ్లింది. దొంగలు, దొంగలు అంటూ కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా.. లోపలికి రానిద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఏదైనా సందేహం వస్తే.. 100కి కాల్ చేయాలని సూచించారు.

ప్రియుడితో ఉన్న కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. చివరకు...

Read more