అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..

ABN , First Publish Date - 2022-01-14T00:19:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ బలరాంపూర్‌ రామానుజ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన ముఖేష్‌ మరావి అనే వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చెల్లెళ్లను కూతుళ్లలా చూసుకోవాల్సింది పోయి.. వక్రదృష్టితో చూశాడు. మాయమాటలు చెప్పి వారితో ..

అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..
పోలీసుల అదుపులో నిందితులు

కొందరు వయసు, వరసలు చూసుకోకుండా జంతువుల్లా ప్రవర్తిస్తుంటారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. వారు చేసే పనులు ప్రజలు ఛీదరించుకునేలా ఉంటాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చూస్తేనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన పని సంచలనంగా మారింది. వారిద్దరూ కలిసి ఒకే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే కొన్నాళ్లకు మరో యువతితో అతను వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం బయటకు తెలియడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే.. 


ఉత్తరప్రదేశ్‌ బలరాంపూర్‌ రామానుజ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన ముఖేష్‌ మరావి అనే వ్యక్తికి.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది. మాయమాటలు చెప్పి వారితో రోజూ రాసలీలలు సాగించేవాడు. ఇలా బయట ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కలుసుకునేవారు. అయితే ముఖేష్ ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. మొదట పరిచయం అయిన ఇద్దరు మహిళలకు తెలీకుండా మూడో యువతితో ప్రేమాయణం సాగించేవాడు. ఈ విషయం ఇద్దరు ప్రియురాళ్లకు ఆలస్యంగా తెలిసింది.


మూడో యువతితో అక్రమ సంబంధం కొనసాగించడాన్ని వారిద్దరూ జీర్ణించుకోలేకపోయారు. రోజూ ఈ విషయమై గొడవపడేవారు. అయినా ముఖేష్‌ మాత్రం మూడో ప్రేయసితో కలిసి తిరిగేవాడు. దీంతో ఎలాగైనా అతన్ని హతమార్చాలని అక్కాచెల్లెళ్లిద్దరూ కుట్రపన్నారు. డిసెంబర్ 26న ముఖేష్‌ను ఊరి బయటికి రమ్మని పిలిచారు. అక్కడ మళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో అతన్ని హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి వెళ్లారు. జనవరి 3న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ప్రియురాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2022-01-14T00:19:03+05:30 IST