-
-
Home » Prathyekam » What did the husband finally do when he came home from abroad after finding out that his wife was pregnant kjr spl-MRGS-Prathyekam
-
విదేశాల నుంచి ఇటీవలే ఇంటికొచ్చిన భర్త.. సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా భార్య గర్భిణి అని తెలిసి..
ABN , First Publish Date - 2022-10-02T00:36:13+05:30 IST
భార్యాభర్తల (couple) మధ్య ఒకరిపై మరొకరికి కలిగే అనుమానాలు.. చివరకు కాపురంలో చిచ్చు పెడుతుంటాయి. చిన్నగా మొదలయ్యే గొడవలు.. చివరకు చిలికి చిలికి గాలివానలా..

భార్యాభర్తల (couple) మధ్య ఒకరిపై మరొకరికి కలిగే అనుమానాలు.. చివరకు కాపురంలో చిచ్చు పెడుతుంటాయి. చిన్నగా మొదలయ్యే గొడవలు.. చివరకు చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. కొన్నిసార్లు విడాకులు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఒక్కోసారి భర్తను భార్య, భార్యను భర్త హత్య చేసే వరకూ వెళ్తుంటుంది. ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం. తాజాగా గుజరాత్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం విదేశాల్లో పని చేస్తున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. అయితే సడన్‌గా భార్య గర్భిణి అని తెలిసింది. దీంతో ఈ బిడ్డ నాది కాదంటూ అతడు చేసిన పని.. స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ (Gujarat) ఆనంద్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య పర్ణిత, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగించేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం విదేశాలకు (foreign countries) వెళ్లాడు. అక్కడ పని చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. పర్ణిత తన కుమార్తెతో కలిసి అత్తగారింట్లోనే ఉండేది. అయితే భర్త పంపే డబ్బుల విషయంలో అత్తమామల నుంచి వేధింపులు (Harassment) మొదలయ్యాయి. రోజురోజుకూ సమస్య పెద్దదవుతుండడంతో చివరకు తన పుట్టిళ్లు అయిన పియర్ అనే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఇలావుండగా, ఇటీవలే పర్ణిత భర్త విదేశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. భర్త పిలవడంతో పర్ణిత మళ్లీ అత్తగాటింటికి వెళ్లింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అనుకోని సమస్య ఎదురైంది.
Viral Video: ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు..? విమానాశ్రయంలో కనిపించగానే అమాంతం అతడి కాళ్లపై ఆమె ఎందుకు పడిందంటే..
పర్ణిత గర్భిణి (pregnant) అని తెలియడంతో భర్త ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. నేను విదేశాల్లో ఉంటే.. నువ్వెలా గర్భిణి అయ్యావంటూ.. భార్యను దుర్భాషలాడడు. అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి వెళ్లిపో.. అంటూ బయటికి గెంటేశాడు. దీంతో పర్ణిత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు తన సమస్యను అభయం అనే మహిళా పోలీసులకు తెలియజేసింది. వారి సాయంతో ఇటీవలే భర్త ఇంటికి వచ్చింది. దంపతులిద్దరినీ పోలీసులు విచారించగా.. భర్త కావాలనే గొడవ చేశాడని తేలింది. అతడు స్వదేశానికి వచ్చి ఐదు నెలలు అయిందని.. పర్ణిత ఇటీవలే గర్భిణి అయిందని తెలిసింది. దీంతో పర్ణిత భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఇంకోసారి ఇలా చేయొద్దంటూ హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభయ అనే మహిళా పోలీసు బృందాలను నియమించారని, ఎవరికైనా వేధింపులు ఎదురైతే వెంటనే సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు.