స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తున్న బాలిక.. ఇంటికి రాగానే ఊహించని ఘటన.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం..

ABN , First Publish Date - 2022-07-07T21:38:40+05:30 IST

కొందరు బాలికలు చిన్న సమస్యలను కూడా సీరియస్‌గా తీసుకుంటుంటారు. ఇంకొందరు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మరికొందరు తల్లిదండ్రులు మందలించారని, ప్రేమికుడు మోసం చేశారనే..

స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తున్న బాలిక.. ఇంటికి రాగానే ఊహించని ఘటన.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం..

కొందరు బాలికలు చిన్న సమస్యలను కూడా సీరియస్‌గా తీసుకుంటుంటారు. ఇంకొందరు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మరికొందరు తల్లిదండ్రులు మందలించారని, ప్రేమికుడు మోసం చేశారనే కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలిక తన స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తుండగా, చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం ఆమె ఇంటికి చేరుకోగానే.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫతేపూర్‌ పరిధిలోని ముత్తౌర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న నవాబ్‌ అలీ అనే వ్యక్తికి భార్య సహీనా, కుమార్తె ముస్కాన్(13), సైఫ్ , ఆసిఫ్, ఆకిబ్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నవాబ్ అలీ.. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, బుధవారం సాయంత్రం బాలిక ముస్కాన్.. స్థానికంగా ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన స్నేహితురాలైన సానియా అనే బాలిక కూడా స్నానం చేయడానికి వచ్చింది. ఈ క్రమంలో కారణం ఏమో తెలీదు గానీ.. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే గొడవ గురించి సానియా.. తన సోదరుడు దిల్షాద్‌కు తెలియజేసింది. దీంతో అతను కోపంతో ముస్కాన్ ఇంటికి వెళ్లాడు. అప్పుడే  చెరువు వద్ద నుంచి ఇంటికి వచ్చిన ముస్కాన్‌ను.. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు.

wapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..


ఇంకోసారి తన చెల్లెలితో మాట్లాడితే నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో ముస్కాన్.. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మార్కెట్‌కు వెళ్లిన ముస్నాన్ తల్లి.. కాసేపటికి ఇంటికి వచ్చింది. ఉరికి వేలాడుతున్న కూతురును చూసి బోరున విలపించింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. అక్కడికి చేరుకుని, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సానియా సోదరుడు గతంలోనూ తమ కుమార్తెను పలుమార్లు వేధించాడని ముస్కాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..  

Updated Date - 2022-07-07T21:38:40+05:30 IST