మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!

ABN , First Publish Date - 2022-07-19T22:24:39+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే అన్ని ప్రేమ కథల్లో మాదిరిగానే వీరి ప్రేమ కథలో కూడా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కూతురికి ఇష్టం లేకున్నా బలవంతంగా వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. మేం..

మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే అన్ని ప్రేమ కథల్లో మాదిరిగానే వీరి ప్రేమ కథలో కూడా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కూతురికి ఇష్టం లేకున్నా బలవంతంగా వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. మేం ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటామని ఎంత బ్రతిమాలినా పెద్దలు మాత్రం కనికరించలేదు. అంతటితో ఆగకుండా చివరకు వారు చేసిన నిర్వాకం తెలుసుకుని.. అంతా షాక్ అయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం  బన్స్వారా పరిధి ఉమ్రావత్ గ్రామానికి చెందిన పంకజ్, మీనా అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వారికి తమ కూతురిని పెళ్లి చేయడం ఇష్టం లేక.. కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఝలోద్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తితో మీనాకు వివాహం చేశారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద పెళ్లి చేసుకున్న మీనాకు అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో వెంటనే పంకజ్‌కు ఫోన్ చేసి, విషయం తెలియజేసింది. గుజరాత్ వెళ్లిన పంకజ్... ప్రియురాలిని తీసుకుని వాపి అనే ప్రాంతానికి వెళ్లాడు.

అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవతో.. వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. Ice cream కోసం యువకుడి బైక్‌లో వెళ్లామంటూ చెప్పుకొచ్చిన చెల్లెలు..


అక్కడే గది అద్దెకు తీసుకుని ఇద్దరూ కలిసి జీవించారు. రోజూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందనే సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు వారి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత శనివారం ఇద్దరూ సొంత గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే పంకజ్‌పై కోపంతో ఉన్న కుటుంబ సభ్యులు.. అతన్ని చూడగానే ఒక్కసారిగా దాడి చేశారు. అనంతరం అతన్ని చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించి మరీ చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Shocking: బాలికకు భూతవైద్యం చేస్తానని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లాడు.. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూస్తే..Updated Date - 2022-07-19T22:24:39+05:30 IST