పెళ్లి మంటపంలో వరుడి ముందే.. స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్లిన యువతి.. కాసేపటికి అంతా షాకయ్యేలా...

ABN , First Publish Date - 2022-10-01T00:01:02+05:30 IST

వారిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల..

పెళ్లి మంటపంలో వరుడి ముందే.. స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్లిన యువతి.. కాసేపటికి అంతా షాకయ్యేలా...
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల వారు కూడా అంగీకరించారు. దీంతో పెళ్లిమంటపంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి..  బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు. తాళి కట్టే తంతు పూర్తయిన కాసేపటికి.. స్నేహితులతో మాట్లాడి వస్తానని వధువు ఓ గదిలోకి వెళ్లింది. అయితే ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అందరికీ అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతికారు. అయినా ఆమె కనిపించలేదు. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) కర్నాల్ జిల్లా జుండ్లా గేట్ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌కు కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఫతేపూర్ పరిది బింద్కి ప్రాంతానికి చెందిన యువతితో సోషల్ మీడియాలో (Social media) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. చివరికి ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరుకుటుంబాలు కూడా ఇందుకు అంగీకరించడంతో వారికి ఏ సమస్యా లేకుండా పోయింది. రెండు కుటుంబాల వారు కలిసి మంచి ముహూర్థం చూసుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫతేపూర్ గాంధీనగర్ ప్రాంతంలో ఓ పెద్ద హోటల్లో కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. తాళి కట్టే తంతు పూర్తవగానే వధూవరులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా మాట్లాడుతున్నారు.

Viral Video: రైల్లో మొబైల్ కొట్టేయాలని చూసిన దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణీకులు.. తలుపుల వద్దే బయటకు వేళాడదీసి..


అయితే కాసేపటి తర్వాత, స్నేహితులతో మాట్లాడి వస్తా అని భర్తకు చెప్పిన వధువు.. ఓ గదిలోకి వెళ్లింది. లోపల రూ.2లక్షల నగదు, బంగారు, కొత్త దుస్తులన్నీ మూట్టగట్టుకుని.. అటునుంచి అటే పరారైంది. వధువు ఎంత సేపటికీ రాకపోవడంతో వరుడికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లాడు. లోపల ఆమె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. చివరకు సాయంత్రం వరకు చూసినా ఆమె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గదిలో పరిశీలించగా నగలు, నగదు మాయమైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వధువు స్నేహితుడితో పాటూ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

నెల రోజుల క్రితం యువతితో బ్యాంక్ మేనేజర్‌కు నిశ్చితార్థం.. సడన్‌గా కాబోయే భార్య నుంచి ఫోన్.. ఆమె అలా చెప్పడంతో..Read more