Instagram friends: ప్రేమికుల మధ్య ఇన్‌స్టా ‘‘స్నేహితుల’’ సమస్య.. వారిని వదులుకునే ప్రసక్తే లేదంటూ ప్రియురాలు చెప్పింది వినగానే..

ABN , First Publish Date - 2022-09-28T21:17:37+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం చిన్నదైపోయింది. ఎలాంటి సమాచారాన్ని అయినా చిటికెలో తెలుసుకునే సౌలభ్యం వచ్చేసింది. అలాగే ఈ టెక్నాలజీ వల్ల సమస్యలు..

Instagram friends: ప్రేమికుల మధ్య ఇన్‌స్టా ‘‘స్నేహితుల’’ సమస్య.. వారిని వదులుకునే ప్రసక్తే లేదంటూ ప్రియురాలు చెప్పింది వినగానే..
ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం చిన్నదైపోయింది. ఎలాంటి సమాచారాన్ని అయినా చిటికెలో తెలుసుకునే సౌలభ్యం వచ్చేసింది. అలాగే ఈ టెక్నాలజీ వల్ల సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎదురవుతుంటాయి. ఎక్కడెక్కడి వారో స్నేహితులుగా మారిపోతుంటారు. అయితే వీరిలో కొందరు స్వార్థం కోసం స్నేహం చేస్తుండగా.. మరికొందరు స్వచ్ఛమైన మనసుతో స్నేహం చేస్తుంటారు. వీటిలో కొన్ని పరిచయాలు.. అప్పుడప్పుడూ ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. మహారాష్ట్రలో విచిత్ర ఘటన చోట చేసుకుంది. ప్రేమికుల మధ్య ఇన్‌స్టా స్నేహితుల కారణంగా సమస్యల తలెత్తింది. వారిని వదులుకోనంటూ ప్రియురాలు చెప్పడంతో ప్రియుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్ పరిధి రామ్ నగర్ ప్రాంతానికి చెందిన రోహన్ సింగ్ కపూర్ (22) అనే యువకుడు.. కొన్ని నెలల క్రితం అతడికి ఓ యువతిని పరిచయమైంది. ఆ పరిచయం కాస్త.. కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. ఇద్దకి మధ్య ఎలాంటి సమస్యలూ లేవనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య తలెత్తింది. యువతి ఇటీవల ఇన్‌స్టా అకౌంట్ (Instagram account) ఓపెన్ చేసింది. ఈ క్రమంలో ఆమెకు చాలా మంది ఫ్రెండ్ రిక్వెస్టులు (Friend requests) రావడంతో ఓకే చేసింది. అయితే ఈ విషయం రోహన్‌కు తెలిసింది. స్నేహితులందరినీ అన్‌ఫ్రెండ్ చేయమని చెప్పాడు. అయితే ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. చివరకు స్నేహితులను వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్పాడు. దీంతో రోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దుర్గా పండల్ అనే ప్రాంతంలో ఒంటరిగా కూర్చుని చాలా సేపు ఆలోచించాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

చెల్లెలి కూతురిని చంపేయాలని చూసిన అన్న.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. విచారణలో ఏం తెలిసిందంటే..


పురుగుల మందు తాగి.. సమీపంలో ఉన్న ఓ వ్యక్తిని పిలిచి విషయం తెలియజేశాడు. తన అన్నయ్యకు విషయం చెప్పాలని సూచించాడు. విషయం తెలుసుకున్న రోహన్ సోదరుడు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రోహన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోహన్‌కు అప్పులు కూడా చాలా చేశాడని విచారణలో తెలిసింది. దీనికి తోడు ప్రియురాలి విషయంలో సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

King Cobra video: అది కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా.. మరీ ఇలా ఆడుకుంటున్నావేంట్రా..



Updated Date - 2022-09-28T21:17:37+05:30 IST