-
-
Home » Prathyekam » What did the boyfriend do after calling his girlfriend to a deserted place outside the village In Bihar kjr spl-MRGS-Prathyekam
-
ఒకే ఒక్క విషయంలో మాట వినలేదని.. ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచి.. ఇద్దరు స్నేహితులతో కలిసి..
ABN , First Publish Date - 2022-07-16T02:33:00+05:30 IST
ప్రేమికుల విషయంలో చిన్న చిన్నసమస్యలు.. ఒక్కోసారి హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ప్రేమించుకునే సమయంలో అన్యోన్యంగా ఉండే జంటలు.. తీరా పెళ్లి వరకు..

ప్రేమికుల విషయంలో చిన్న చిన్నసమస్యలు.. ఒక్కోసారి హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ప్రేమించుకునే సమయంలో అన్యోన్యంగా ఉండే జంటలు.. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి గొడవ పడుతుంటాయి. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం బీహార్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని కోపం పెంచుకున్నాడు. ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్ అనే వ్యక్తి, 22ఏళ్ల యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్లి చేసుకుందామంటూ మొహమ్మద్.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.
Viral Video: నడి రోడ్డులో ఇద్దరు యువతుల కొట్లాట.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజన్లు..
ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్లి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.