అయ్యో పాపం.. మరీ ఇంత ఘోరమా.. ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ఈ యువతి ఎంత నీచానికి పాల్పడిందంటే..

ABN , First Publish Date - 2022-02-06T00:17:09+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు. అయితే వివిధ కారణాలతో వారి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు. యువతికి మాత్రం ఎలాగైనా తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ అది సాధ్యం కాకపోవడంతో మానసిక క్షోభను అనుభవించింది. ఆ స్థానంలో..

అయ్యో పాపం.. మరీ ఇంత ఘోరమా.. ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ఈ యువతి ఎంత నీచానికి పాల్పడిందంటే..

వారిద్దరూ ప్రేమికులు. అయితే వివిధ కారణాలతో వారి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు. యువతికి మాత్రం ఎలాగైనా తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ అది సాధ్యం కాకపోవడంతో మానసిక క్షోభను అనుభవించింది. ఆ స్థానంలో వేరే వారుంటే, కొన్నాళ్లకు ఆ బాధనుంచి బయటపడి.. పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపేవారు. కానీ ఈ యువతి మాత్రం ప్రియుడి గురించే ఆలోచిస్తూ ఉండేది. తన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని ఎంతటి నీచానికి పాల్పడిందంటే..


పోలీసుల కథనం మేరకు.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని పిపాడ్ తహసీల్‌లోని సాథియన్ గ్రామంలోని సమ్‌దారి నది సమీపంలో ఓ ప్లాస్టిక్ సంచి కలకలం సృష్టించింది. అందులో 12ఏళ్ల బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. సాథియన్ గ్రామానికి చెందిన సంతోష్ అనే యువతి, దినేష్ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు.

నిద్రలోంచి లేవగానే గదిలో కనిపించని అక్క.. అనుమానంతో తల్లిదండ్రులకు చెప్పిన చెల్లి.. ఇంటి వెనుక షాకింగ్ సీన్ చూసి..


ఈ క్రమంలో వివిధ కారణాలతో మధ్యలోనే విడిపోయారు. దినేష్‌కు వేరే యువతితో ఫిబ్రవరి 12న వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న సంతోష్.. ఎలాగైనా తన ప్రియుడి వివాహాన్ని ఆపాలని నిర్ణయించుకుంది. దినేష్ మేనల్లుడైన నరేష్ అనే బాలుడికి మాయ మాటలు చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లింది. అక్కడ అతడి నోట్లో బలవంతంగా చున్నీ పెట్టి, పదునైన ఆయుధంతో హత్య చేసింది. అనంతరం కాళ్లు బయటికి కనబడేలా సంచిలో కుక్కి, గ్రామ పరిసరాల్లో పడేసింది. పోలీసుల విచారణలో నిందితురాలు.. ఈ నిజాలన్నీ బయటపెట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

భార్య పరాయి మగవారితో ఉండగా చూడటమే అతడి వ్యసనం.. అందుకోసం చివరికి ఏం చేశాడో తెలుసా..

Read more