ఈ యువతీయువకుల Dangerous Dance చూస్తే మతి పోతుంది.. విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు..

ABN , First Publish Date - 2022-07-09T03:09:58+05:30 IST

నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యువతులు కూడా వీరితో చేరి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ...

ఈ యువతీయువకుల Dangerous Dance చూస్తే మతి పోతుంది.. విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు..

నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యువతులు కూడా వీరితో చేరి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో యువతీయువకులు చేసిన డ్యాన్స్.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై తీవ్ర ఆగ్రహం చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు.


బీహార్ రాష్ట్రం పాట్నాలోని మానేర్‌లో మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ వివాహ వేడుకలో యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతా కలిసి మందేసి, చిందేశారు. కొందరు యువతీయువకులు.. చేతిలో పిస్టల్ పట్టుకుని మరీ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. చాలా మంది యువతీయువకులు పిస్టళ్లను అటూ ఇటూ ఊపుతూ నృత్యం చేశారు. ఈ క్రమంలో పిస్టల్ పేలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది.  అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతా డ్యాన్స్ చేస్తుండగా.. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. శుక్రవారం విచారణకు ఆదేశించారు. అంత మంది వద్ద అక్రమంగా పిస్టళ్లు ఉండడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన్ నవజిత్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు.

Viral Video: ఇలాక్కూడా ఇస్త్రీ చేస్తారా.. ఇతను బట్టలను Iron చేసే విధానం చూస్తే.. వామ్మో! అని అంటారు..

Read more