-
-
Home » Prathyekam » video of an elephant saving a man who was drowning in a river is going viral spl-MRGS-Prathyekam
-
Viral Video: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసిన ఏనుగు.. చివరికి ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2022-07-06T02:00:31+05:30 IST
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మనుషుల కంటే మేమే నయమని.. చాలా జంతువులు నిరూపిస్తుంటాయి. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్...

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మనుషుల కంటే మేమే నయమని.. చాలా జంతువులు నిరూపిస్తుంటాయి. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించిన ఏనుగు.. పరుగు పరుగున వెళ్లి కాపాడిన తీరును చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో మానవత్వం చూపించిన ఓ ఏనుగుకు వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుల మద నదిని దూటుతూ ఉంటుంది. అన్ని ఏనుగులూ అవతలి ఒడ్డుకు చేరుకునే లోపు.. ఓ వ్యక్తి నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తుంటాడు. ఏనుగుల మందలో చివరన ఉన్న ఏనుగు.. అతన్ని గమనిస్తుంది. క్షణం ఆలస్యం చేయకుండా పరుగందుకుంటుంది. నదీ ప్రవాహాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు అతన్ని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తుంది. ఏనుగు తొండాన్ని పట్టుకోగానే అతడిలో ఆనందం వెల్లువిరుస్తుంది. చాలా కాలం క్రితం జరిగన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏనుగుది ఎంత మంచి మనసు.. అంటూ కొందరు, మనుషుల కంటే జంతువులు ఎంతో నయం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.