Viral Video: చిన్న పిల్లల పార్కులో ఏనుగు ఎలా ఆడకుంటోందో చూశారా? నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో!
ABN , First Publish Date - 2022-10-18T02:13:52+05:30 IST
పార్కులు కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే అని ఎవరు చెప్పారు?
పార్కులు కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే అని ఎవరు చెప్పారు? ఆటలు కేవలం పిల్లలకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయని ఎవరు చెప్పారు? తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు ఆటను గమనిస్తే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అసోంలోని ఓ చిన్న పిల్లల పార్కులో ఓ ఏనుగు తనను తాను మర్చిపోయి ఒంటరిగా ఆడుకుంటోంది. ఆ వీడియో నెటిజన్ల మనసులను దోచుకుంది.
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అసోంలోని అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉండే ఓ ఏనుగు నారంగి ఆర్మీ కంటోన్మెంట్లోని పిల్లల పార్కులోకి ప్రవేశించింది. చిన్న పిల్లలు ఆడుకునే ఊయలలతో ఆ ఏనుగు ఆడుకుంది. పార్క్లో ఏనుగును గుర్తించిన ఓ స్థానికుడు ఆ ఘటనను రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షకు పైగా వ్యూస్ సాధించింది. `ఈ దృశ్యాన్ని చూడటం చాలా సరదాగా ఉంది. ఇంత అందమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తికి చాలా ధన్యవాదాలు` అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.