Viral Video: చిరుతలా ఉరుకుతున్న మొసలి.. చూస్తే షాకవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2022-08-25T01:07:10+05:30 IST

సాధారణంగా మొసళ్లు (crocodiles) చాలా బద్ధకంగా కనిపిస్తుంటాయి.

Viral Video: చిరుతలా ఉరుకుతున్న మొసలి.. చూస్తే షాకవ్వాల్సిందే!

సాధారణంగా మొసళ్లు (crocodiles) చాలా బద్ధకంగా కనిపిస్తుంటాయి. నోరు తెరుచుకుని కదలకుండా ఉంటూనో లేదా నెమ్మదిగా నడుస్తూనో ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ మొసలి చిరుత పులి తరహాలో పరుగెడుతోంది. అమెరికాలో ఉన్న ఓ జూ పార్క్‌లో మొసలి పరుగు తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


ముందు ఓ మనిషి పరిగెడుతుండగా అతడిని వెంబడిస్తూ మొసలి రన్నింగ్ చేసింది. ఆ వీడియోను IFS అధికారి Susanta Nanda ట్విటర్‌లో షేర్ చేసి.. `మొసలి పరిగెత్తడం నేనెప్పుడూ చూడలేద`ని ట్వీట్ చేశారు. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా.. ఇప్పటివరకూ 79 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-08-25T01:07:10+05:30 IST