Viral News: కస్టమర్‌కు షాకిచ్చిన స్విగ్గీ.. గోబీ మంచురియా, కార్న్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే..
ABN , First Publish Date - 2022-08-19T17:01:46+05:30 IST
ఆకలేస్తే అప్పటికప్పుడు వంట చేసుకోవాల్సిన పని లేదు. దగ్గర్లో మంచి హోటల్లు ఎక్కడున్నాయంటూ ఆరా తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు. స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) వంటి ఫుడ్ డెలివరీ యాప్స్(Food delivery apps) వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నోరూరించే ఫుడ్‌ను చిటికెలో ఆర్డర్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వ

ఇంటర్నెట్ డెస్క్: ఆకలేస్తే అప్పటికప్పుడు వంట చేసుకోవాల్సిన పని లేదు. దగ్గర్లో మంచి హోటల్లు ఎక్కడున్నాయంటూ ఆరా తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు. స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) వంటి ఫుడ్ డెలివరీ యాప్స్(Food delivery apps) వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నోరూరించే ఫుడ్‌ను చిటికెలో ఆర్డర్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి తాజాగా స్విగ్గీని ఆశ్రయించాడు. కస్టమర్ రేటింగ్ చూసి.. స్థానికంగా ఉన్న ప్రముఖ రెస్టారెంట్లో నుంచి ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ పెట్టాడు. చివరికి తనకు డెలివరీ అయిన పార్శల్‌ను ఓపెన్ చూసి కంగుతిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన లిరికిస్ట్(Tamil lyricist) కో సెహా.. ప్యూర్ వెజిటేరియన్. చిన్నప్పటి నుంచి మాంసాహారానికి దూరంగా ఉన్నాడు. బాగా ఆకలేసి ఆయన తాజాగా స్విగ్గీని ఆశ్రయించాడు. యాప్ ద్వారా స్థానికంగా ఉన్న రెస్టారెంట్ నుంచి గోబీ మంచురియా, కార్న్ ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్(vegetarian meal ordered at Swiggy) పెట్టాడు. కొద్ది సమయం తర్వాత డెలివరీ బాయ్ వచ్చి.. అతడికి పార్శల్‌ను అందించాడు. డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శల్‌ను ఇంట్లోకి తీసుకెళ్లిన అతడు.. దాన్ని ఓపెన్ చేశాడు. పార్శల్ చివరి భాగంలో అతడికి చికెన్(Chicken) ముక్కలు కనబడటంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో స్పందించిన స్విగ్గీ.. అతడికి పరిహారంగా రూ.70 అకౌంట్లో జమ చేసింది. దీంతో అతడు మరింత అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. తను పాటిస్తున్న విలువలు, సంప్రదాయానికి స్విగ్గీ వెలకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా స్విగ్గీ ప్రతినిధులు.. తనను పర్సనల్‌గా సంప్రదించి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాడు. లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం అవుతానంటూ హెచ్చరించాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.