అతను కూరగాయలు విక్రయించేవాడు.. ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు.. ఎయిర్ హోస్టెస్‌ని పెళ్లిచేసుకున్నాడు.. చివరికి..

ABN , First Publish Date - 2022-01-24T09:38:56+05:30 IST

ఒక కూరగాయలు విక్రయించే యువకుడు తక్కువ సమయంలోనే కోటీశ్యరుడయ్యడు. విమాన ప్రయాణంలో ఒక ఎయిర్ హోస్టెస్‌పై మనసు పారేసుకున్నాడు. ఆమెను మెప్పించడానికి ఒక సంవత్సరం పాటు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేశాడు...

అతను కూరగాయలు విక్రయించేవాడు.. ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు.. ఎయిర్ హోస్టెస్‌ని పెళ్లిచేసుకున్నాడు.. చివరికి..

ఒక కూరగాయలు విక్రయించే యువకుడు తక్కువ సమయంలోనే కోటీశ్యరుడయ్యడు. విమాన ప్రయాణంలో ఒక ఎయిర్ హోస్టెస్‌పై మనసు పారేసుకున్నాడు. ఆమెను మెప్పించడానికి ఒక సంవత్సరం పాటు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేశాడు. అమ్మాయిని ఎలాగోలా ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతా బాగుందనుకున్న సమయంలో అతడి నేర వృత్తి గురించి పోలీసులు పసిగట్టారు. పక్కా ప్లాన్‌తో అతడిని అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ నిజజీవిత ఘటనలు బీహార్ రాష్ట్రంలో జరిగాయి.


వివాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన సమర్ ఘోష్ అనే యువకుడు 12వ తరగతి చదువుకున్నాడు. పేదరికంలో ఉండి కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు అమ్ముకునేవాడు. బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం ఉండడంతో పక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తే బాగా డబ్బులు సంపాదించవచ్చని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. రోజూ విక్రయించే కూరగాయల మధ్యలో మద్యం బాటిళ్లు దాచి అక్రమంగా సరఫరా చేసేవాడు. అలా చేస్తూ అతి తక్కువ కాలంలోనే పెద్ద లిక్కర్ స్మగ్లర్‌గా ఎదిగాడు. 


ఈ క్రమంలో ఒకసారి సమర్ ఘోష్ పట్నా నుంచి కలకత్తాకు విమానంలో ప్రయాణిస్తుండగా.. ఒక ఎయిర్ హోస్టెస్‌‌తో పరిచయం ఏర్పడింది. ఆమెను సమర్ ఇష్టపడేవాడు. ఆమె కోసం తరుచూ విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణం చేసేవాడు. అలా ఆమె వెంటబడి ప్రేమించి.. పెళికూడా చేసుకున్నాడు. మరోవైపు పోలీసులు మద్యం అక్రమ రవాణా చేసేవారి నిఘా పెట్టారు. వారికి సమర్ ఘోష్ గురించి సమాచారం అందింది. 


సమర్ ఘోష్ తన రహస్య స్థావరంలో స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా.. ఒకరోజు పోలీసులు దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుం సమర్ ఘోష్‌పై మద్యం స్మగ్లింగ్ కేసు నమోదైంది. అతడని రిమాండ్‌పై జైలుకు తరలించారు.Updated Date - 2022-01-24T09:38:56+05:30 IST