ప్రియురాళ్ల కోరికలు తీర్చేందుకు పక్కదారి పట్టిన ఇద్దరు కుర్రాళ్లు.. చివరకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అరెస్ట్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-06-17T22:07:05+05:30 IST

ఆ ఇద్దరు కుర్రాళ్లూ జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతుంటారు.. ఇద్దరికీ గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారు..

ప్రియురాళ్ల కోరికలు తీర్చేందుకు పక్కదారి పట్టిన ఇద్దరు కుర్రాళ్లు.. చివరకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అరెస్ట్.. అసలు కథేంటంటే..

ఆ ఇద్దరు కుర్రాళ్లూ జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతుంటారు.. ఇద్దరికీ గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. ప్రియురాళ్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కోసం ఇద్దరూ పక్కదారి పట్టారు.. తొలుత మొబైల్ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు.. ఆ తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్లను, అపార్ట్‌మెంట్‌లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడడం ప్రారంభించారు.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. 


ఇది కూడా చదవండి..

రోడ్డుపై అడుక్కుంటున్న పిల్లలు.. బిస్కెట్ ప్యాకెట్‌కు బదులు పొరపాటున 10 తులాల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఇచ్చిందో మహిళ.. చివరకు..


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన మనీష్ పరీక్, ప్రకాష్ చౌదరి అనే యువకులు తమ గాళ్‌ఫ్రెండ్స్ కోసం దొంగలుగా మారారు. వారికి ఖరీదైన బహుమతులు అందించేందుకు దొంగతనాలకు పాల్పడేవారు. మొదట్లో మొబైల్ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. గతంలో ఒకసారి పోలీసులకు దొరికిపోయి జైలుపాలయ్యారు. బయటకు వచ్చాక రూటు మార్చారు. తాళం వేసి ఉన్న ఇళ్లను, అపార్ట్‌మెంట్‌లను టార్గెట్ చేసి విలువైన వస్తువులను, డబ్బును దోచుకునేవారు. ఒక అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు. పోలీసులు వెంటనే వారి కోసం అన్వేషణ సాగించి అరెస్ట్ చేశారు. వారికి సహాయం చేశారనే కారణంతో వారి గాళ్‌ఫ్రెండ్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-06-17T22:07:05+05:30 IST