పెరోల్‌పై వచ్చిన ఖైదీ పరార్...33 ఏళ్ల తర్వాత అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-13T18:07:31+05:30 IST

పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన యూపీ అత్యాచార దోషి 33 ఏళ్ల తర్వాత అరెస్టయిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది....

పెరోల్‌పై వచ్చిన ఖైదీ పరార్...33 ఏళ్ల తర్వాత అరెస్ట్

నోయిడా: పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన యూపీ అత్యాచార దోషి 33 ఏళ్ల తర్వాత అరెస్టయిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.1987వ సంవత్సరంలో దోషిగా తేలిన రఘునందన్ సింగ్ మూడు దశాబ్దాలకు పైగా తన భార్యతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారని హత్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పారు.1986వ సంవత్సరంలో సింగ్ పై అత్యాచారం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన అత్యాచార దోషి అయిన సింగ్ పెరోల్‌పై విడుదలై పారిపోయి ఢిల్లీ వచ్చి నకిలీ గుర్తింపుతో నివసిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్రాస్‌లోని అతని స్వగ్రామంలో రఘునందన్ సింగ్ (56) మరణించాడని అతని బంధువులు, తోటి గ్రామస్థులు చెప్పారు.కాగా సింగ్ బతికే ఉన్నాడని తెలుసుకుని షాక్ అయ్యామని గ్రామస్థులు తెలిపారు.


1987లో దోషిగా తేలిన సింగ్ మూడు దశాబ్దాలుగా తన భార్యతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారని, అక్కడి గార్మెంట్ రిటైల్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నారని ఎస్పీ చెప్పారు.‘‘సింగ్ అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన కోర్టు అతన్ని జైలుకు పంపింది. కానీ శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతనికి పెరోల్ మంజూరు చేశారు. అతను పెరోల్‌పై విడుదలై జంప్ అయ్యాడు .గత 33 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు అరెస్టు చేశాం’’ అని హత్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినీత్ జైస్వాల్ చెప్పారు. సింగ్ జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చిన తర్వాత గ్రామంలోని స్థిర, స్థిర ఆస్తులన్నింటినీ విక్రయించి పరారీలో ఉన్నాడు. అతను కొత్త నకిలీ గుర్తింపుతో ఢిల్లీకి వెళ్లి, అక్కడే వివాహం చేసుకుని స్థిరపడ్డాడు’’ అని జైస్వాల్ చెప్పారు.అతను మూడు దశాబ్దాలుగా ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నివసిస్తున్నాడని, అతడిని అరెస్టు చేయాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందని జైస్వాల్ తెలిపారు.Updated Date - 2022-04-13T18:07:31+05:30 IST