బిర్యానీ బాగోలేదని హోటల్‌లో తుపాకీ కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-20T08:42:51+05:30 IST

ఆ బిర్యానీ హోటల్‌కు స్థానికంగా మంచి పేరుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ హోటల్‌పై సడెన్‌గా ఇద్దరు దుండగులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలో వెలుగు చూసింది. స్థానికంగా బాగా పాపులర్ అయిన ‘డి బాపీ’ అనే హోటల్‌లో...

బిర్యానీ బాగోలేదని హోటల్‌లో తుపాకీ కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే..

ఆ బిర్యానీ హోటల్‌కు స్థానికంగా మంచి పేరుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ హోటల్‌పై సడెన్‌గా ఇద్దరు దుండగులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలో వెలుగు చూసింది. స్థానికంగా బాగా పాపులర్ అయిన ‘డి బాపీ’ అనే హోటల్‌లో సోమవారం నాడు కూడా ఎప్పట్లాగే రద్దీగా కస్టమర్లు ఉన్నారు. అందరూ తమ తమ భోజనాలు చేస్తూ మాటల్లో మునిగిపోయి ఉన్నారు. 


అలాంటి సమయంలో అక్కడకు బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. వచ్చీరావడంతోనే తమతోపాటు తీసుకొచ్చిన తుపాకులతో ఆ హోటల్‌పై గుళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఒక కస్టమర్‌తోపాటు హోటల్‌లో పనిచేసే ఒక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దాడి గురించి తన తండ్రి సమాచారం అందించాడని, అయితే దీని వెనుక ఎవరున్నారనే విషయం కచ్చితంగా చెప్పలేమని ఆ హోటల్ యజమాని అనిర్బన్ దాస్ తెలిపారు.


అయితే ఇటీవల ఒక వ్యక్తి తమ హోటల్‌లో బిర్యానీ బాగా లేదంటూ గొడవచేశాడని.. అతనే ఈ ఘటనకు కారణం కావచ్చని హోటల్ యజమాని అనుమానం వ్యక్తం చేశారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more