Google: గూగుల్‌లో ఇది ట్రై చేశారా.. సెర్చ్ బార్‌లోకి Diwali పదాన్ని టైప్ చేస్తే..

ABN , First Publish Date - 2022-10-18T02:10:07+05:30 IST

దేశంలో దిపావళి(Diwali) పండుగ హడావుడి మొదలైపోయింది. వెలుగుల పండుగ కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కోలాహలంలో(festivities) పాలుపంచుకునేందుకు గూగుల్(google) కూడా రంగంలోకి దిగింది.

Google: గూగుల్‌లో ఇది ట్రై చేశారా.. సెర్చ్ బార్‌లోకి Diwali పదాన్ని టైప్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో దీపావళి(Diwali) పండుగ హడావుడి మొదలైపోయింది. వెలుగుల పండుగ కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కోలాహలంలో పాలుపంచుకునేందుకు గూగుల్(google) కూడా రంగంలోకి దిగింది. తనదైన శైలిలో వెలుగులకు ఆహ్వానం పలికింది. ఇది చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆన్‌లైన్ దీపావళి జరుపుకునేందుకు గూగుల్ భలే అవకాశమిచ్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు గూగుల్ ఏం చేసిందంటారా..? 


  • ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే..ముందుగా మీరు గూగుల్ సెర్చ్ బార్‌లో Diwali లేదా Diwali 2022 అని ఇంగ్లిష్‌లో టైప్ చేయాలి.
  • సెర్చ్ రిజల్ట్స్‌లోని మొదటిపేజీకి పైన ఎడమవైపునకు ‘దీపపు ప్రమిద’ ఐకాన్ కనిపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేయగానే.. ఒక్కసారిగా పేజ్ మొత్తం చీకటిగా మారిపోతుంది. కంగారు పడకండి.. ఆ తరువాత అసలు సర్‌ప్రైజ్ మొదలవుతుంది. 
  • తొలుత పేజీ మొత్తం నల్లగా మారిపోతోంది. ఆ తరువాత.. కొన్ని దీపపు ప్రమిదలు ప్రత్యక్షమవుతాయి. మీరు కర్సర్‌తో వాటిన్నటినీ  వెలిగిస్తే.. ‘చీకట్లన్నీ’ తొలగిపోయి.. పేజీ మళ్లీ ఎప్పటిలాగే కనిపిస్తుంది. 

ఇది ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మరీ మీరు ఓమారు ట్రై చేయండి.. 









Updated Date - 2022-10-18T02:10:07+05:30 IST