అక్కాచెల్లెళ్లతో ఓ యువకుడి ప్రేమ.. మూడో యువతి అతని జీవితంలోకి రావడంతో..

ABN , First Publish Date - 2022-01-14T10:30:15+05:30 IST

తన విలాసాల కోసం ఒక యువకుడు ఇద్దరు అక్కాచెల్లెళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దికాలం తరువాత అతని జీవితంలో మరో యువతి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు అతనికి ఇంటికి పిలిచి బాగా మందు తాగించి...

అక్కాచెల్లెళ్లతో ఓ యువకుడి ప్రేమ.. మూడో యువతి అతని జీవితంలోకి రావడంతో..

తన విలాసాల కోసం ఒక యువకుడు తన గ్రామానికే చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దికాలం తరువాత అతని జీవితంలోకి మరో యువతి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు అతడిని ఇంటికి పిలిచి బాగా మద్యం తాగించి హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా బగాడి గ్రామానికి చెందిన ముకేశ్ అనే యువకుడు లలిత, సరిత(పేర్లు మార్చబడినవి) అనే అక్కాచెల్లెళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు యువతులను సంవత్సరం క్రితమే వారి భర్తలు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆ ముగ్గురికి అడ్డు చెప్పే వారే లేకుండా పోయింది. కానీ ఒకరోజు ముకేశ్‌ మరో యువతిని ప్రేమిస్తున్నాడని లలిత, సరితలకు తెలిసింది. ఇది తెలిసి ప్రియుడిని అంతమొందించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. 


లలిత, సరితలు ఒకరోజు ముకేశ్‌ని మద్యం పార్టీ పేరుతో ఇంటికి పిలిచారు. ఇంట్లో ముకేశ్‌కి బాగా మద్యం తాగించి బయటకు తీసుకెళ్లారు. ఊరి చివరకు తీసుకెళ్లి అక్కడ రాళ్లతో అతడి తలపై కొట్టి హత్య చేశారు. ఆ తరువాత ఒక పాత బడ్డ బావిలో ముకేశ్ శవాన్ని పడేశారు. వారం రోజుల తరువాత బావిలో నుంచి వాసన రావడం చూసి చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమందించారు. ముకేశ్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ముకేశ్ హత్యకేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు లలిత, సరితలను ప్రశ్నించారు. ముకేశ్ హత్య జరిగిన సమయంలో అదే ప్రాంతంలో వీరిద్దరి ఫోన్ లొకేషన్ ఉండడంతో అనుమానంతో అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి వారిద్దరూ హత్య చేసినట్లు నేరం అంగీకరించడంతో పోలీసులు వారిపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2022-01-14T10:30:15+05:30 IST