రెండు నిమిషాల్లో 60 రకాల స్వరాలు
ABN , First Publish Date - 2022-02-06T17:27:34+05:30 IST
నామక్కల్ జిల్లా పి.కుమారపాళయం సమీపం సడయాంపాళయంకు చెందిన పెరియనాయకం-ఎలిజబెత్ కుమార్తె దెల్ఫియా. రెండేళ్ల 5 నెలల వయసున్న ఈ చిన్నారి 2 నిముషాల్లో 60 రకాల స్వరాలు పలికించి
పెరంబూర్(చెన్నై): నామక్కల్ జిల్లా పి.కుమారపాళయం సమీపం సడయాంపాళయంకు చెందిన పెరియనాయకం-ఎలిజబెత్ కుమార్తె దెల్ఫియా. రెండేళ్ల 5 నెలల వయసున్న ఈ చిన్నారి 2 నిముషాల్లో 60 రకాల స్వరాలు పలికించి రికార్డ్ సృష్టించింది. 500 చిత్రాలను చూసి పేర్లు చెప్పి అబ్బురపరిచింది. చిన్నారి రికార్డ్ కలాం వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో నమోదుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.