cops arrested: గడ్డి కోయడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు పోలీసుల అఘాయిత్యం.. మరీ ఇంత పైశాచికత్వమా?

ABN , First Publish Date - 2022-10-08T02:37:52+05:30 IST

ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే (Police) అఘాయిత్యానికి పాల్పడ్డారు. జార్ఖండ్‌లోని (Jharkhand) లోహర్‌దగా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది.

cops arrested: గడ్డి కోయడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు పోలీసుల అఘాయిత్యం.. మరీ ఇంత పైశాచికత్వమా?

లోహర్‌దగా, జార్ఖండ్: ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే (Police) అఘాయిత్యానికి పాల్పడ్డారు. జార్ఖండ్‌లోని (Jharkhand) లోహర్‌దగా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోయడానికి వెళ్లిన 50 ఏళ్ల మహిళపై ఇద్దరు పోలీసులు బలత్కారానికి (Raped) పాల్పడ్డారు. నిందితులిద్దరూ అత్యంత పైశాచికత్వంగా వ్యవహరించారు. బాధితురాలి ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచారు. అత్యంత అమానవీయంగా వ్యవహరించి వేదనకు గురిచేశారు. తీవ్ర విచారకరమైన ఈ ఘటన అక్టోబర్ 4న జరిగింది. ఘటన సమయంలో నిందితులిద్దరూ మద్యం సేవించి ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.. 


స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదయ్యిందని అధికారులు తెలిపారు. వైద్య రిపోర్టుల ప్రకారం.. బాధితురాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. తొలుత జిల్లా హాస్పిటల్‌లో చేరగా.. తీవ్రత దృష్ట్యా రాంచీ పట్టణంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMs)కు తరలించారు.

Updated Date - 2022-10-08T02:37:52+05:30 IST